రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తన నివాసంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆయన మొక్కలు నాటారు.
ఈనెల 17వ తేదీన సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. మొక్కలు నాటి ఫొటోలు దిగాలన్న ఆయన వాటిని 9000365000 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని కోరారు. హరిత సంకల్పంలో మీ కృషికి గుర్తింపుగా ముఖ్యమంత్రి నుంచి వనమాలి బిరుదును ఈ మెయిల్, మొబైల్‌కు వారం లోపు పంపుతారని తెలిపారు.
ఇదీ చదవండి: 'తెలంగాణపై అవగాహన లేని వారు వచ్చి విమర్శలు చేస్తున్నారు'