సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. రాజ్ భవన్ అతిథిగృహంలో బస చేస్తున్న సీజేను పోచారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైనందుకు ఆయనకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ ఎన్వీ రమణకు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.
ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ