ETV Bharat / state

ప్రైవేటు పెట్టబడులతో నాలుగో జోన్​గా అంతరిక్ష రంగం

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), జేఎన్‌టీయూ సంయుక్తంగా అంతరిక్ష రంగంలో కొత్త అవకాశాలు’ అంశంపై నిర్వహించిన వెబ్‌నార్‌ సమావేశంలో ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ కీలకోపన్యాసం చేశారు. భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి అంతరిక్ష రంగం అద్భుత అవకాశం కల్పించనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

space sector develops says isro former chairman
ప్రైవేటు పెట్టబడులతో నాలుగో జోన్​గా అంతరిక్ష రంగం
author img

By

Published : Jun 6, 2020, 7:55 AM IST

భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి అంతరిక్ష రంగం అద్భుత అవకాశం కల్పించనుందని ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశోధన, ప్రయాణం, పర్యాటకం, సాహసంతో పాటు భూమిపై ఉన్న కమ్యూనికేషన్‌, నావిగేషన్‌ల నిర్వహణకు అంతరిక్షం వేదికగా మారనుందని పేర్కొన్నారు. భూమి, గాలి, సముద్రంలా నాలుగో జోన్‌గా అంతరిక్షం నిలుస్తోందని చెప్పారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 200 నుంచి 300 బిలియన్‌ డాలర్ల వాటా ఈ రంగానిదేనన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘అంతరిక్ష రంగంలో కొత్త అవకాశాలు’ అంశంపై శుక్రవారం కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), జేఎన్‌టీయూ సంయుక్తంగా నిర్వహించిన వెబ్‌నార్‌ సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. శాటిలైట్‌లు, శాటిలైట్‌ వాహకాలు, ఇతర పరికరాల తయారీ ద్వారా కమ్యూనికేషన్‌, రిమోట్‌ సెన్సింగ్‌, నావిగేషన్‌ తదితరాలను అందించగలుగుతున్నట్లు తెలిపారు.

ఆర్థిక వ్యవస్థలో అంతరిక్ష రంగానిది కీలకం

కార్యక్రమ సమన్వయకర్త, జేఎన్‌టీయూ పర్యావరణ కేంద్రం అసోసియేట్‌ ప్రొఫెసర్‌, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ టి.విజయలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సంస్కరణలు కొనసాగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో అంతరిక్ష రంగం వాటా అయిదారేళ్లలో 10 మిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. చైనా, అమెరికా, ఐరోపా దేశాలు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, భారత్‌లో కూడా రాకెట్‌, శాటిలైట్‌ పరికరాల తయారీలో ప్రైవేటు కంపెనీలు భాగస్వాములవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎ.గోవర్ధన్‌, సీఐఐ తెలంగాణ విద్య, నైపుణ్యం విభాగం కన్వీనర్‌, ఎఎల్‌పీఎల్‌ఎ ఇండియా ఎండీ వాగిష్‌ దీక్షిత్‌ ప్రసంగించారు.

కరోనాతో ఏకతాటిపై ప్రపంచం

కరోనా కారణంగా ప్రపంచం ఏకతాటిపైకి వచ్చిందని.. జంతువులు, ప్రకృతి, మానవులు ఒకరినొకరు రక్షించుకుంటూ వసుధైక కుటుంబంగా నిలవాలని కిరణ్‌కుమార్‌ సూచించారు. ఈ నేపథ్యంలో భూమిని దాటి ఆకాశంలోకి చూడాలని, ఇందులో ఎన్నో అవకాశాలున్నాయని తెలిపారు. ఇప్పటికే ప్రైవేటు సంస్థలు మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. అంతరిక్ష రంగంపై ఇస్రో చర్చా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. హైదరాబాద్‌ జీడిమెట్లలో రిమోట్‌ సెన్సింగ్‌ కేంద్రాన్ని నెలకొల్పి, అక్కడ శాటిలైట్‌ డేటా అందిస్తోందన్నారు. ఒక యూనివర్సిటీ విద్యార్థులు ఒకచోట ఎక్కువగా ఉన్న ఆహారాన్ని గుర్తించి.. లేనివారికి అందజేయడానికి వీలుగా ఓ యాప్‌ను రూపొందించారన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.