ETV Bharat / state

Rains in Telangana : నైరుతిరాకతో.. రాష్ట్రవ్యాప్తంగా జోరు వర్షాలు.. తడిసిముద్దయిన భాగ్యనగరం - Hyderabad Rains

Rains in Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో... వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట లభించింది. రుతుపవనాల రాక కోసం ఎదురుచూస్తున్న రైతులు... ఈ వానలతో సాగుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌, రంగారెడ్డితోపాటు పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు... రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షం నీరు పొంగి ప్రవహించింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Rains
Rains
author img

By

Published : Jun 24, 2023, 10:49 PM IST

Updated : Jun 25, 2023, 6:45 AM IST

నైరుతిరాకతో.. రాష్ట్రవ్యాప్తంగా జోరు వర్షాలు.. తడిసిముద్దయిన హైదరాబాద్

Rains in Telangana Today : రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన ఎండలతో అల్లాడిన ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో తెప్పరిల్లారు. భరించలేని ఉక్కపోతలో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వానలు ఉపశమనం కల్పించాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీల్లో రోడ్లపై వాన నీరు పొంగి పొర్లింది. ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టితో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు గాలిదుమారం, మరోవైపు భారీ వర్షం కురవడంతో పాదచారులు మెట్రో పిల్లర్లను ఆశ్రయించారు. పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న వారంతా జోరువానలో తడిసి ముద్దయ్యారు.

Rains in Hyderabad : రాత్రి ఒంటిగంట వరకూ హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో 8.1 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్‌లో 1.9, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో 1.3 సెంటీమిటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌తోపాటు పరిసర గ్రామాల్లోనూ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, కెపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లో వర్షం ఓ మోస్తరుగా పడింది. కుత్బుల్లాపూర్, సూరారం, కొంపల్లి, జీడిమెట్లలో భారీ వర్షం పడింది. హైదరాబాద్‌ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ముందుగానే హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయ్యింది. డీఆర్‌ఎఫ్ బృందాలు, జీహెచ్‌ఎంసీ అధికారులు వరద సహాయకచర్యల్లో పాల్గొన్నారు. యాదాద్రిలోనూ జోరుగా వర్షం కురిసింది. ఏకబిగిన కురిసిన వానలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చూపరులను ఆకట్టుకుంది. ఆలయం ప్రాంగణంలోని నల్లరాతి కృష్ణశిలలు, రాజగోపురాలపై నుంచి కిందకు జారిన వర్షపు ధారలు... సందర్శకులకు కనువిందు చేశాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది.

ఈ జిల్లాలో భారీ వర్షాలు.. కొమురం భీం, మంచిర్యాల,కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు ఆవర్తనము వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాలలోని ఒడిస్సా- పశ్చిమ బెంగాల్‌ తీరాలకు దగ్గరలో సగటు సముద్రమట్టానికి 7.6కిలో మీటర్ల వరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి స్థిరంగా కొనసాగుతుందని వివరించారు.

ఈసారీ ఎల్​నినో ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవడం ప్రారంభం కావడంతో రైతన్నలు సాగుకు సమయత్తమవుతున్నారు. కానీ ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యం కావడంతో సాగు నెమ్మదించింది. గతేడాది కంటే ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు . రుతుపవనాల ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంవత్సరం వానాకాలంలో వర్షపాతం అయిదు శాతం వరకూ తగ్గవచ్చని చెబుతున్నారు. రుతుపవనాల మందగమనానికి ఎల్‌నినో ప్రభావం కొంత కారణం ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘పసిఫిక్‌ మహా సముద్రంలోని పెరు, ఈక్వెడార్‌ల సముద్ర జలాలు సాధారణం కన్నా ఏడు డిగ్రీలు అదనంగా వేడెక్కి వీచే గాలుల్లో ఒత్తిడి అత్యధికమైంది. ఆ ప్రభావం భారత్​ సమీప సముద్ర జలాలపైనా పడుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 25, 2023, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.