ETV Bharat / state

ఇంధన పొదుపులో ద.మ.రైల్వే ప్రతిభ : జీఎం గజానన్ - గజానన్ మాల్యా వార్తలు

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా భారతీయ రైల్వేల్లో ప్రపథమంగా దక్షిణ మధ్య రైల్వే ఎనర్జీ న్యూట్రల్​ స్టేషన్​ ప్రవేశపెట్టడం పట్ల ద.మ రైల్వే జనర​ల్ మేనేజర్ గజానన్ మాల్యా హర్షం వ్యక్తంచేశారు. జాతీయ ఇంధన వారోత్సవాల వెబినార్​లో పాల్గొన్నారు.

southern-central-railway-energy-saving-week-celebrations-at-secunderabad-rail-bhavan
సికింద్రాబాద్​ రైల్ నిలయంలో ఇంధన వారోత్సవాలు
author img

By

Published : Dec 16, 2020, 7:37 PM IST

భావి తరాల కోసం ఇంధనాన్ని కొంతమేర పొదుపు చేయాలని.. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్​ మాల్యా అన్నారు. జాతీయ ఇంధన వారోత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్​ రైల్​ నిలయంలో ఏర్పాటు చేసిన వెబినార్​లో పాల్గొన్నారు. ఇంధన పొదుపులో 2020 సంవత్సరానికి దక్షిణ మధ్య రైల్వే ప్రతిభ కనబరిచి.. సీఐఐ ద్వారా ఆరు అవార్డులు పొందిందని తెలిపారు.

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా భారతీయ రైల్వేల్లోనే... ప్రప్రథమంగా దక్షిణ మధ్య రైల్వే ఎనర్జీ న్యూట్రల్ స్టేషన్స్‌ ప్రవేశపెట్టడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సంప్రదాయేతర విద్యుత్‌ను ఒడిసిపట్టడంలో వినూత్న పద్ధతులను అవలంభిస్తూ... ప్లాట్​ఫారాలపై సోలార్ రూఫ్‌, సోలార్ కవర్, డే లైట్‌ పైపును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఐఎస్​బీతో దక్షిణ మధ్య రైల్వే ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.