ETV Bharat / state

అమరువీరుల స్థూపానికి సౌత్​ ఇండియా అడ్వొకేట్స్​ ఐకాస నివాళులు - సౌత్​ ఇండియా అడ్వొకేట్స్​ ఐకాస

న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర సర్కారు 25 కోట్ల రూపాయలు ప్రకటించడాన్ని సౌత్​ ఇండియా అడ్వొకేట్స్​ ఐకాస స్వాగతించింది. గన్​పార్క్​ వద్ద ఉన్న అమరువీరుల స్థూపానికి ఐకాస నాయకులు నివాళులర్పించారు.

south india advocate jac at gunpark in hyderabad
అమరువీరుల స్థూపానికి సౌత్​ ఇండియా అడ్వొకేట్స్​ ఐకాస నివాళులు
author img

By

Published : Jun 21, 2020, 6:39 PM IST

లాక్​డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం 25 కోట్ల రూపాయలు ప్రకటించడాన్ని... సౌత్ ఇండియా అడ్వొకేట్స్ ఐకాస స్వాగతించింది. ఈ సందర్భంగా ఐకాస నాయకులు గన్​పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదుల పాత్ర ముఖ్యమైందని... న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఐకాస కన్వీనర్ నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేద న్యాయవాదిని ఎటువంటి షరతులు లేకుండా ఆర్థిక సహాయాన్ని అందించాలని వారు విజ్ఞప్తి చేసారు. రానున్న రోజుల్లో న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు.

ఇవీ చూడండి: పచ్చదనం, పరిశుభ్రతలో ఆ గ్రామం ఆదర్శం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.