ETV Bharat / state

లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకున్న ద.మ.రైల్వే

లాక్‌డౌన్ సమయంలో రైలు పట్టాలు, కేంద్రాలు, క్రాసింగ్‌లు, స్లీపర్ల పునరుద్ధరణ పనులు చేపట్టడం వల్ల రైళ్లు వేగంగా ప్రయాణించేలా చేయగలిగామని ద.మ. రైల్వే శాఖ సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. ఈ సమయంలో 984 కిలోమీటర్ల మేర రైలు మార్గాలను పునరుద్ధరించినట్లు వివరించారు.

south central railway utilized lockdown period for Maintenance of rails
లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకున్న ద.మ.రైల్వే
author img

By

Published : May 29, 2020, 12:18 PM IST

లాక్‌డౌన్ కాలాన్ని ద.మ.రైల్వే పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. ఈ సమయంలో పట్టాల నిర్వహణ పనులు కొనసాగించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 6,336 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలున్నాయి. 754 రైల్వేస్టేషన్లలో ప్రతిరోజూ సుమారు 750 ప్రయాణికుల రైళ్లు, 300ల గూడ్స్ రైళ్లు వీటి పరిధిలో నడుస్తుంటాయి.

లాక్‌డౌన్ సమయంలో రైలు పట్టాలు, కేంద్రాలు, క్రాసింగ్‌లు, స్లీపర్ల పునరుద్ధరణ పనులు చేపట్టడం వల్ల పట్టాల భద్రతతో పాటు, రైళ్లు వేగంగా ప్రయాణించేలా చేయగలిగామని ద.మ. రైల్వే శాఖ సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. మే 1 నుంచి 25వ తేదీ వరకు ఈ పనులు చేపట్టినట్లు వివరించిన ఆయన.. ఈ సమయంలో 984 కిలోమీటర్ల మేర రైలు మార్గాలను పునరుద్ధరించామన్నారు.

486 స్థలాల్లో క్రాసింగ్‌లు, అలైన్‌మెంట్‌ను సరిచేశామని రాకేశ్‌ పేర్కొన్నారు. 83కి.మీ.ల పరిధిలో రైలు పట్టాల కింద చెత్తను తొలగించడమే కాక.. రైలు పట్టాలు, స్లీపర్ల పునరుద్ధరణ పనులను 5.37 కి.మీల దూరం వరకు పూర్తి చేశామని వివరించారు.

ఇదీచూడండి: 'సీసీఎంబీ వైరస్‌ నమూనాలను ఐసోలేట్‌ చేయగలుగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.