ETV Bharat / state

ఏప్రిల్ 8 నుంచి 14 వరకు 32 గూడ్స్ రైళ్లు - ఏప్రిల్ 8 నుంచి నడవనున్న 32 గూడ్స్ రైళ్లు

ఏప్రిల్ 8 నుంచి 14 వరకు 32 గూడ్స్ రైళ్లను నడపనున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పరిశ్రమలు, సంస్థలు, ఆసక్తి గల బృందాలు, ఎన్జీఓలు తమ డిమాండ్లను రిజిస్టర్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేస్తోంది.

ఏప్రిల్ 8 నుంచి 14 వరకు 32 గూడ్స్ రైళ్లు

author img

By

Published : Apr 8, 2020, 7:14 AM IST

నిత్యావసర సరుకుల రవాణా కోసం దక్షిణ మధ్య రైల్వే గూడ్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతోంది. ఏప్రిల్‌ 8 నుంచి 14 వరకు 32 గూడ్స్‌ రైళ్లు నడుపుతామని...సంస్థలు, పరిశ్రమలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ సూచించింది. కాకినాడ- సికింద్రాబాద్ మధ్య రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ, కాజీపేట మీదుగా డైలీ పార్శిల్ ఎక్స్​ప్రెస్ రైళ్లు నడుస్తాయి. రేణిగుంట- సికింద్రాబాద్ మధ్య డైలీ పార్శిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు... గూడూరు, విజయవాడ, కాజీపేట్ మీదుగా 4 రోజులు.. గుంతకల్లు, రాయచూర్, మీదుగా మిగతా రోజులు నడుస్తాయి. ఏప్రిల్ 08 నుంచి 12 వరకు రేణిగుంట- నిజాముద్దీన్ మధ్య 2 దూధ్ దురంతో ప్రత్యేక రైళ్లు నడిపించనున్నారు. డిమాండ్‌ను బట్టి మరిన్ని మార్గాల్లోనూ పార్శిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడపాలని రైల్వేశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:ఎంపీల వేతనాల్లో కోతకు ఆర్డినెన్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.