ETV Bharat / bharat

ఎంపీల వేతనాల్లో కోతకు ఆర్డినెన్స్​ - coronavirus death toll

corona
కరోనా పంజా
author img

By

Published : Apr 7, 2020, 9:22 AM IST

Updated : Apr 7, 2020, 11:02 PM IST

22:55 April 07

ఆర్డినెన్స్​...

కరోనాపై పోరులో భాగంగా ఎంపీల జీతాల్లో 30శాతం కోత విధిస్తూ కేంద్రం సోమవారం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్​ అమల్లోకి వచ్చింది. వచ్చే పార్లమెంట్​ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్​ను బిల్లుగా మార్చనున్నారు.

21:05 April 07

బ్రిటన్​లో సరికొత్త రికార్డ్

బ్రిటన్​లో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ఆ దేశంలో తాజాగా 786 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్​లో కరోనా కారణంగా ఒకే రోజులో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి.

బ్రిటన్​లో ఇప్పటివరకు 55 వేల మందికిపైగా కరోనా సోకింది. 6 వేల 159 మంది మరణించారు. 135 మంది కోలుకున్నారు.

21:02 April 07

న్యూయార్క్​ గజగజ

కరోనా మహమ్మారి న్యూయార్క్​లో మరణ మృదంగం మోగిస్తోంది. ఆ నగరంలో 24 గంటల్లోనే 731 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఈ విషయం వెల్లడించారు.

అమెరికావ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల 77 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 11 వేల 781 మంది మరణించారు. దాదాపు 20 వేల మంది కోలుకున్నారు.

20:40 April 07

మహారాష్ట్రపై కరోనా పంజా విసురుతోంది. రాష్టంలో తాజాగా 12మంది వైరస్​ బారిన పడి చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 64కు చేరుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

20:30 April 07

బిహార్​లో మరో రెండు కరోనా కేసులు

బిహార్​లో మరో ఇద్దరికి కరోనా సోకింది. సివాన్​ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు వైరస్​ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34కు చేరుకుంది.

20:07 April 07

ఒమన్ సుల్తాన్​తో ఫోన్​లో మాట్లాడిన మోదీ

కరోనాపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ తారిక్ ఫోన్​లో సంభాషించుకున్నారు. సంక్షోభం నేపథ్యంలో ఆరోగ్యం, ఆర్థిక రంగాలపై కరోనా ప్రభావం ఎలా ఉందనే అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు. మహమ్మారి నుంచి తమ దేశాలను కాపాడుకునే విషయంపై నేతలిద్దరూ వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

19:57 April 07

గుజరాత్​లో కొత్తగా 19 కేసులు.. ఇద్దరు మృతి

గుజరాత్​లో కొత్తగా 19 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 175కు చేరుకుంది. తాజాగా వైరస్​తో ఇద్దరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

19:44 April 07

మహారాష్ట్రలో వెయ్యి దాటిన కరోనా బాధితులు

మహారాష్ట్రలో కరోనా వైరస్​ కోరలు చాస్తోంది. దేశంలోనే అత్యధిక కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 1018కి  చేరుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 150 కేసులు నమోదైనట్లు పేర్కొంది.

19:27 April 07

ముంబయిలో మరో ఐదుగురు మృతి  

కరోనా వైరస్​ మహారాష్ట్రలో స్వైర విహారం చేస్తోంది. తాజాగా ఒక్క ముంబయిలోనే వంద కేసులు నమోదు కాగా.. ఐదు మరణాలు సంభవించాయి. దీంతో ముంబయిలో కరోనా మరణాల సంఖ్య 40కి చేరుకోగా.. కేసులు 590కి పెరిగాయి.

19:13 April 07

భారత్​లో కరోనా.. 124కు చేరిన మరణాలు

దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను వెల్లడించింది కేంద్ర ఆరోగ్యశాఖ. భారత్​లో కరోనా మరణాలు 124కు చేరుకున్నట్లు తెలిపింది. సాయంత్రం 7గంటల వరకు 4,312 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 352 మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో 508 కేసులు, 24 మరణాలు సంభవించినట్లు చెప్పింది ఆరోగ్య శాఖ. దేశం మొత్తంలో ఇప్పటివరకు 4,789 కేసులు నమోదైనట్లు వెల్లడించింది.  

19:12 April 07

పంజాబ్​లో కొత్తగా 8మందికి కరోనా

పంజాబ్​లో కొత్తగా 8మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 99కి చేరుకుంది.

19:01 April 07

హరియాణాలో మరో 33మందికి కరోనా

హరియాణాలో మరో 33మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 129కు చేరుకున్నట్లు తెలిపింది. అందులో ఇద్దరు మరణించినట్లు, 17మంది కోలుకున్నట్లు పేర్కొంది.

18:57 April 07

జమ్ముకశ్మీర్​లో కరోనాతో మరొకరు మృతి  

జమ్ముకశ్మీర్​లో కరోనా వేగంగా విస్తరిస్తోంది.  తాజాగా వైరస్​ సోకి మరొకరు మృతి చెందారు. దీంతో  జమ్ముకశ్మీర్​లో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది.  మొత్తం 125 మందికి వైరస్​ సోకింది.

18:54 April 07

3లక్షలకు పైగా ఎన్​95 మాస్కులు సిద్ధం

మహారాష్ట్రలో కరోనా ప్రబలుతున్నందున ఎలాంటి పరిస్థితులు తలెత్తినా తట్టుకునేందుకు వీలుగా ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. రాష్ట్రంలో 3,02795 ఎన్​95మాస్కులు, 41,100 పీపీఈ కిట్లు, 2,666 ఐసీయూ బెడ్లు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

18:48 April 07

జమ్ముకశ్మీర్​లో మరో 60మందికి కరోనా  

జమ్ముకశ్మీర్​లో మరో 60మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కేసుల సంఖ్య 125కు చేరుకున్నాయి.

18:44 April 07

'కరోనా బాధితులకు ఆయుర్వేద చికిత్సను అందిచండి'

కరోనా సోకిన వారికి ఆయుర్వేద చికిత్సను అందించవచ్చని కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ పేర్కొన్నారు. వైరస్​ను అరికట్టేందుకు సరైన చికిత్స లేనందున.. ఆయుర్వేద చికిత్సను నివారణ చర్యగా భావించాలన్నారు.

18:33 April 07

తమిళనాడులో కరోనాతో మరొకరు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మరో 69మందికి వైరస్ సోకినట్లు పేర్కొంది. తాజా కేసులతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 690కు చేరుకున్నట్లు వివరించింది.

17:37 April 07

ఉత్తర్​ప్రదేశ్​లో 314కు చేరిన కరోనా కేసులు

ఉత్తర్​ప్రదేశ్​లో ఇప్పటి వరకు 314 మందికి కరోనా సోకినట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్​ తెలిపారు. అయితే అందులో 168మంది దిల్లీ మర్కజ్​కు వెళ్లివచ్చిన వారేనని పేర్కొన్నారు.

17:32 April 07

పశ్చిమబంగాల్​లో మరో 8మందికి కరోనా

పశ్చిమబంగాల్​లో కొత్తగా 8మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 69కి చేరినట్లు ప్రకటించింది. అలాగే ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు వెల్లడించింది.

17:24 April 07

గుజరాత్​లో కరోనాకు మరో ఇద్దరు బలి  

గుజరాత్​లో కరోనాకు మరో ఇద్దరు మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14కు చేరుకున్నట్లు తెలిపాయి.

17:22 April 07

జమాత్​ వెళ్లిన వారికి పంజాబ్​ సర్కారు డెడ్​లైన్​

జమాత్​ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు 24గంటల్లో సమీప పోలీస్​ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని పంజాబ్​ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. తర్వాత గుర్తిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

17:06 April 07

విమాన సర్వీసులపై నిషేధం పొడిగించిన నేపాల్‌

  • అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలపై నిషేధం పొడిగించిన నేపాల్‌
  • ఏప్రిల్‌ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలపై నిషేధం పొడిగింపు

16:19 April 07

భారత్​లో ఇప్పటివరకు 4,421కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతినిధి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 24గంటల్లో 354 కేసులు, 8మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. దేశంలో కరోనా సోకి మొత్తం 114మంది చనిపోయినట్లు వివరించారు. కరోనా సమన్వయానికి నూతన విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పటివరకు 1,07,006 మందికి కరోనా పరీక్షలు పూర్తయినట్లు చెప్పుకొచ్చారు.

కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆస్పత్రుల్లో అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతినిధి లవ్ అగర్వాల్. సాంకేతిక పరిజ్ఞానంతో క్వారంటైన్‌లో ఉన్నవారిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.  కరోనా తీవ్రత, అత్యంత విషమంగా ఉన్న బాధితులకు వేర్వేరుగా చికిత్స అందిస్తున్నామన్నారు. రైల్వే కోచ్‌ల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 2,500 రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చినట్లు చెప్పారు.

లాక్‌డౌన్‌ను పొడిగించాలని రాష్ట్రాలు కోరుతున్నట్లు తెలిపారు లవ్ అగర్వాల్. రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్రం ఆలోచన చేస్తోందన్నారు. అయితే లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. లాక్‌డౌన్‌ పొడిగింపుపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దన్నారు అగర్వాల్.

16:13 April 07

భారత్​లో ఇప్పటివరకు 4,421కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24గంటల్లో 354 కేసులు, 8మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. దేశంలో కరోనా సోకి మొత్తం 114మంది చనిపోయినట్లు వివరించింది.

15:47 April 07

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యుఘోష ఆగడం లేదు. వైరస్​ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 75,896మంది మృతి చెందారు. స్పెయిన్​లో గత 24గంటల్లోనే 743మంది మరణించారు.

15:36 April 07

మహారాష్ట్రలో కరోనా వైరస్​ స్వైర విహారం చేస్తోంది. తాజాగా పుణెలో వైరస్​తో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఒక్క పుణెలోనే కరోనా మరణాల సంఖ్య 8కి చేరింది. 

15:11 April 07

రాజస్థాన్​లో మరో 3 పాజిటివ్​ కేసులు

రాజస్థాన్​లో మరో 3 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 328కి చేరింది.

15:09 April 07

జపాన్‌లో అత్యవసర స్థితి ప్రకటన

  • జపాన్‌లో పలు ప్రాంతాల్లో అత్యవసర స్థితి ప్రకటన
  • వైరస్‌ కేసుల సంఖ్య 4 వేలకు చేరువ కావడంతో నిర్ణయం
  • టోక్యో సహా 6 ప్రాంతాల్లో అత్యవసర స్థితి ప్రకటించిన ప్రధాని షింజో అబే

15:02 April 07

మధ్యప్రదేశ్​లో పోలీస్​ అధికారికి కరోనా పాజిటివ్​

మధ్యప్రదేశ్​ భోపాల్​కు చెందిన పోలీస్​ ఆఫీసర్​కు కరోనా సోకింది. దీంతో అతడితో కలిసి విధులు నిర్వర్తించిన చాలామంది పోలీసు ఆఫీసర్లను ఐసోలేషన్​కు పంపించారు.

14:54 April 07

లాక్​డౌన్​​ పొడిగించాలని కేంద్రానికి మెజార్టీ రాష్ట్రాల సూచన

కరోనా వైరస్​ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్​డౌన్​ను మరిన్ని రోజులు పొడిగించాలని అధిక రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రానికి కూడా విజ్ఞప్తిని చేశాయి. మెజార్టీ రాష్ట్రాల సూచన మేరకు లాక్​డౌన్​ పొడగింపుపై కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 

14:39 April 07

పోలీసులు, వైద్యులకు రూ. 50లక్షల బీమా

కరోనాపై పోరాడుతున్న పోలీసు సిబ్బంది, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రూ .50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

14:30 April 07

'పీఎం కేర్స్' నిధిని పీఎంఎన్​ఆర్​ఎఫ్​కు బదిలీ చేయాలి: సోనియా​

కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీకి పలు సూచనలు చేశారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.  జీతాలు, పెన్షన్లు, కేంద్ర పథకాలు మినహా వ్యయ బడ్జెట్‌లో 30 శాతం తగ్గిస్తూ ఆర్డినెన్స్​ తేవాలని డిమాండ్​ చేశారు. పారదర్శకత కోసం పీఎం కేర్స్ నిధికి వచ్చిన విరాళాలను ప్రధానమంత్రి నేషనల్ ​రిలీఫ్​ ఫండ్(పీఎంఎన్​ఆర్​ఎఫ్​)​కు బదిలీ చేయాలని సూచించారు.

14:23 April 07

వ్యక్తిగత రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచిన రైల్వే

  • వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచిన రైల్వే
  • వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కోసం వ్యక్తిగత రక్షణ పరికరాల తయారీ
  • రోజుకు 1000 వరకు పీపీఈలను ఉత్పత్తి చేస్తున్న రైల్వే
  • ప్రస్తుతం రైల్వేలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి సరఫరా
    మొత్తం వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈల్లో 50 శాతం సరఫరా చేయాలని లక్ష్యం
  • తొలుత ఉత్తర రైల్వే వర్క్‌షాపులో పరికరాల తయారీని ప్రారంభించిన అధికారులు
  • దేశవ్యాప్తంగా ఉన్న 17 వర్క్‌షాపుల్లో పరికరాలు ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడి

14:21 April 07

ఒడిశాలో తొలి కరోనా మరణం సంభవించింది. రెండు రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ స్థానిన ఎయిమ్స్​లో చేరిన 72 ఏళ్ల వృద్ధుడు నిన్న మరణించారు. అయితే అతడి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ఇదిలా ఉంటే  రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదైంది. 45 ఏళ్ల వ్యక్తికి కరోనా వచ్చినట్లు అధికారులు తెలిపారు.  

13:54 April 07

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 2,046 పాయింట్ల వృద్ధితో ప్రస్తుతం 29,637 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 8,667 వద్ద కదలాడుతోంది.

12:43 April 07

వినియోగదారులకు 'వాట్సాప్​' షాక్​.. ఇకపై ఒక్కరికే షేరింగ్​

కరోనా వేళ అసత్య ప్రచారాలను కట్టడి చేసేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యాప్​లో సమాచారాన్ని ఒక్కరికే షేర్​ చేసేలా మార్పులు తీసుకొచ్చింది. సమాచారాన్ని ఇతరులకు పంపే పరిమితిని తగ్గించడం వల్ల డేటా వినియోగం తగ్గడమే కాకుండా.. అసత్య ప్రచారాలను కూడా సాధ్యమైనంత వరకు నిరోధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

12:32 April 07

యూపీలో ఇప్పటివరకు 308 కరోనా కేసులు నమోదు

యూపీలో ఇప్పటి వరకు 308 కరోనా సోకినట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్​ తెలిపారు. అయితే అందులో 168మంది దిల్లీ మర్కజ్​కు వెళ్లివచ్చిన వారేనని పేర్కొన్నారు.

12:28 April 07

దిల్లీలో మర్కజ్ వెలుపల శానిటేషన్​​

దిల్లీ నిజాముద్దీన్​ ప్రాంతంలోని మర్కజ్​ వెలుపల ప్రాంతంలో పారిశుద్ధ్య సిబ్బంది రసాయన ద్రవాలను పిచికారీ చేస్తున్నారు. దిల్లీలో జమాత్​ ప్రార్థనలకు వెళ్లివచ్చని వారిలో 329 మందికి కరోనా సోకింది. 

12:06 April 07

వలస కూలీల వేతనంపై సుప్రీంలో విచారణ

వలస కూలీలకు ప్రభుత్వాలే వేతనం చెల్లించాలని దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టులో విచారణ

వలస కూలీల అంశంపై అఫిడవిట్ సమర్పించిన కేంద్ర ప్రభుత్వం

వలస కూలీలకు ఆహారంతో పాటు వేతనం ఇవ్వాలని కోరిన పిటిషనర్

ఇళ్లలో ఉండే వాళ్ల కుటుంబీకులకు వేతనం ఇవ్వాలని కోరిన పిటిషనర్

వసతుల పర్యవేక్షణ కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని సొలిసిటర్ జనరల్ వెల్లడి

హెల్ప్‌లైన్‌ను స్వయంగా కేంద్ర హోంశాఖ పర్యవేక్షణ చేస్తుందని తెలిపిన ఎస్‌జీ

సదుపాయాలు కల్పిస్తున్నందున వేతనం చెల్లించాల్సిన అవసరం లేదన్న ఎస్‌జీ

విపత్కర సమయంలో ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

10-15 రోజుల వరకు ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు సీజే

తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

11:58 April 07

రాజ్‌నాథ్ నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ నివాసంలో మంత్రుల బృందం భేటీ అయ్యారు. కరోనా తాజా పరిణామాలపై కేంద్ర మంత్రులు చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశంలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, ప్రకాశ్‌ జావడేకర్, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

11:50 April 07

మధ్యప్రదేశ్​లో మరో 12మందికి కరోనా పాజిటివ్​

మధ్యప్రదేశ్​ భోపాల్​ మరో 12 మందికి కరోనా వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 268కి చేరుకున్నట్లు వెల్లడించారు.

11:39 April 07

మహారాష్ట్రలో కరోనా రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా మరో 23మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య  891కి  చేరుకుంది. దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా చెప్పుకునే ధారవి మహారాష్ట్రలోనే ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో 7 కరోనా కేసులు నమోదు కాగా..  అక్కడ వైరస్​ విజృంభిస్తే అదుపు చేయడం అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

11:31 April 07

కరోనా బాధితులను గుర్తించేదుకు 'డబ్ల్సూఐఎస్​కే'​

కరోనా బాధితులను వేగంగా గుర్తించేందుకు కేరళ ఎర్నాకుళం జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలను చేపట్టారు. వాక్-ఇన్ శాంపిల్ కియోస్క్ (డబ్ల్సూఐఎస్​కే) అనే ప్రక్రియ ద్వారా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. రాపిడ్​ పరీక్షల కోసం డబ్ల్సూఐఎస్​కేను నమూనాగా తీసుకోవచ్చని చెబుతున్నారు.

11:22 April 07

'ఇంట్లోనే  ప్రార్థనలు చేసుకోండి'

ఏప్రిల్ 9న షాబ్ ఇ బరాత్ వేడుక నేపథ్యంలో పుణ్యక్షేత్రాలు, శ్మశాన వాటికల్లోకి ప్రజలను అనుమతించొద్దని నిర్వహణ కమిటీలను ఆదేశించింది  యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించింది.

11:08 April 07

శాకర్​పుర్​లో పేదలకు ఆహారం పంపిణీ

లాక్​డౌన్​ నేపథ్యంలో దిల్లీలో నిరు పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో శాకర్​పుర్​లో పేదలకు స్థానికులు ఆహారాన్ని అందజేశారు. 

10:50 April 07

గుజరాత్​లో మరో 19మందికి కరోనా

గుజరాత్​లో కొత్తగా 19మందికి కరోనా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 165కు చేరుకున్నట్లు వెల్లడించారు.

10:38 April 07

అసోంలో మరో పాజిటివ్​ కేసు

అసోంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 27కు చేరుకున్నట్లు వెల్లడించారు.

10:30 April 07

  • ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
  • వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, ఉపరాష్ట్రపతి
  • కరోనాపై పోరాడుతున్న వారికి కృతజ్ఞత చూపించే అవకాశం లభించింది: ప్రధాని
  • దేశంలో ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాలు బాగుండాలని ప్రార్థించాలి: ప్రధాని
  • వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పట్ల కృతజ్ఞతతో మెలగాలి: ప్రధాని మోదీ
  • భౌతిక దూరం వల్ల మనతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోగలం: ప్రధాని
  • సేవలందిస్తున్న వైద్య సమాజాన్ని గౌరవించాలి: ఉపరాష్ట్రపతి
  • వైద్యులు, నర్సుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలి: ఉపరాష్ట్రపతి

10:28 April 07

కరోనా చికిత్సకు ఉపకరిస్తుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం పాక్షికంగా ఎత్తివేసినట్లు తెలుస్తోంది. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని... మానవతా కోణంలో ఆ ఔషధాన్ని ఇతర దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సహా పారాసెటమాల్​ ​ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆ రెండు ఔషధాల ఎగుమతులపై ఇటీవల విధించిన నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేసినట్లు సమాచారం. దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని... ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన దేశాలకు సరఫరా చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఔషధ విభాగం, విదేశాంగ శాఖ మానవతా కోణంలో ఆలోచించి... ఏ దేశానికి ఎంత సరఫరా చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ట్రంప్​ హెచ్చరిక తర్వాత!

మలేరియా నయం చేసేందుకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనా చికిత్సలోనూ కీలకంగా పనిచేస్తోందని ఇటీవల అనేక అధ్యయనాలు వెలువడ్డాయి. ఈ ఔషధాన్ని విప్లవాత్మకమైనదిగా పదేపదే అభివర్ణిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్​ చేసి... తమ దేశం ఆర్డర్ ఇచ్చిన మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్​ను పంపాలని కోరారు. అయితే భారత్​ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

కొద్ది గంటల క్రితమే ఈ అంశంపై మరోమారు స్పందించారు ట్రంప్. భారత్​ సానుకూలంగా స్పందించకపోతే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. కాసేపటికే నిషేధం పాక్షికంగా ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే... అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్​ను భారత్​ ఇస్తుందా లేదా? ఇస్తే ఎంత మొత్తంలో ఇస్తుందన్న అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.

10:07 April 07

మహారాష్ట్రలో మరో 2 కరోనా కేసులు

మహారాష్ట్ర ధారవి ప్రాంతంలో మరో 2 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ  ప్రాంతంలో కరోనా సోకిన వారి సంఖ్య 7కు చేరుకుంది. ధారవి అనేది అసియాలోనే పెద్ద మురికి వాడల్లో ఒకటి. 

10:01 April 07

రాపిడ్​ కరోనా పరీక్షలకు దిల్లీ సర్కారు సన్నద్ధం

రాపిడ్​ కరోనా పరీక్షలకు దిల్లీ సర్కారు సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం లక్ష కిట్లను దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. దేశ రాజధానిలో వైరస్​ కట్టడికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ రాపిడ్​ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించారు.

09:19 April 07

కరోనా పంజా: మరింత పెరిగిన మరణాలు, కేసులు

దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ తీవ్రమవుతోంది. వైరస్​ బారిన పడి గత 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 114కు చేరింది. కేసుల సంఖ్య 4,421కి చేరింది. ఇందులో 3,981 యాక్టివ్ కేసులు కాగా 325 మంది కోలుకున్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. 

Last Updated : Apr 7, 2020, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.