దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్యాసింజర్ రైళ్లు రద్దయినా.. గూడ్స్ రైళ్ల ద్వారా సరుకు రవాణా చేస్తూ సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 4 వరకు 1342 వ్యాగన్ల చక్కెర, 958 వ్యాగన్ల ఉప్పు, 378 వ్యాగన్ల నూనెను సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: సొంతంగా మాస్కు తయారు చేసుకోవటం ఎలా?