సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్నీ ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, చెన్నై, త్రివేండ్రం, భువనేశ్వర్, హౌరా, ముంబాయి, న్యూ దిల్లీ, గౌహతి, దానాపూర్, జైపూర్, నాగపూర్, నాందేడ్, పర్బాని, ఔరంగాబాద్, సిర్పుర్ కాగజ్నగర్కుఈ పండుగ ప్రత్యేక రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో సరిపడు రిజర్వేషన్ల కౌంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులు సరైన మాస్క్‌లు ధరించటంతోపాటు స్టేషన్లు, రైళ్లలో భౌతిక దూరం పాటించాలన్నారు. జ్వరం,దగ్గు, జలుబు లక్షణాలున్న వ్యక్తులు ప్రయాణం చేయొద్దని సూచించారు.
ఇదీ చదవండి: వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. సిద్ధంగా ఉండండి: కేంద్రం