దేశ రవాణా వ్యవస్థలో దక్షిణ మధ్య రైల్వేది ప్రత్యేక స్థానం. హైదరాబాద్‌లో 2003 ఆగస్టు 9న ప్రారంభించిన ఎంఎంటీఎస్ రైళ్లు ప్రతిరోజూ దాదాపు లక్షా యాభై వేల మందిని గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఈ రైళ్లలో అధికారులు మార్పులు చేశారు. సాంకేతికతంగా అభివృద్ధి చేస్తూ... ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. నూతన కోచ్‌ల్లో సౌకర్యాలపై ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తోన్న వివరాలు...
ఇదీ చూడండి : 'పాముల కంటే 'మౌస్' పట్టుకునే వారే ఎక్కువ'