కరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా రైల్వే శాఖ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ద.మ. రైల్వే వద్ద ఉన్న వనరులను ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనువుగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటికే లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రిలో 30 బెడ్లు, జూనియర్ కళాశాలలో 87 బెడ్లు, మెట్టు గూడ చౌరస్తాలోని రైల్ కల్యాణ్‌లో 30 బెడ్లను ద.మ. రైల్వే పరిధిలో సుమారు 1000 బెడ్లను క్వారంటైన్ కేంద్రాల్లో వినియోగించేలా సిద్ధం చేసింది. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా అవసరమైన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటోన్న ద.మ. రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.
ఇవీ చూడండి: రాష్ట్రంలో తొలి కరోనా మరణం... 67కు పెరిగిన బాధితులు