దీపావళి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగ సమయంలో సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లే వాళ్లు .. అనంతరం తిరిగి తమ గమ్యానికి చేరేందుకు అనుగుణంగా రైల్వే శాఖ రైళ్లను నడపనుంది. పండుగ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లకు సంబంధించి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి అగర్తల వరకు, మచిలీపట్నం నుంచి కర్నూలు.... న్యూ జలపగురి నుంచి కన్యాకుమారి.. నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి విజయవాడ, దన్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లను ప్రయాణికులంతా సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైల్వే శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
- 07455 నంబర్ ట్రైన్ అక్టోబర్ 31 న సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి 1 నవంబర్ తెల్లవారు జాము 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ 7, 14 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
- 07456 నంబర్ గల ట్రైన్ నవంబర్ 1న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయలు దేరి నవంబర్ 2 తెల్లవారు జాము 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు నవంబర్ 8, 15 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
- 07460 నంబర్ గల రైలు 7 నవంబర్ తెల్లవారు జాము 5.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరునాడు మధ్యాహ్నం 12.45 గంటలకు దనాపూర్ చేరుకుంటుంది.
- 07459 నంబర్ గల రైలు నవంబర్ 11న ఉదయం 11గంటలకు దనాపూర్ నుంచి బయలుదేరి మర్నాడు సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఇదీ చూడండి: Special Train Services : నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నాలుగు ప్రత్యేక రైళ్లు