ETV Bharat / state

భారత్​లో సంస్థను విస్తరిస్తామని చెప్పారు.. నిలువునా దోచేశారు!

సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎంత హెచ్చరించినా... ప్రజలు అమాయకత్వంతోనో, అత్యాశతోనే మోసపోతూనే ఉన్నారు. సౌత్​ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి తన కంపెనీని భారత్​లో విస్తరిస్తానని... దానికి మంచి భాగస్వామి నువ్వేనని సామాజిక మాధ్యమంలో పరియమైన బాధితున్ని నమ్మించి లక్షలు దోచేశాడు.

author img

By

Published : Jul 9, 2020, 7:10 PM IST

south African money fraud in hyderabad
south African money fraud in hyderabad

సామాజిక మాధ్యమంలో పరిచయమైన సౌత్​ ఆప్రికాకు చెందిన వ్యక్తి తన కంపెనీలో భాగస్వామిగా చేరాలంటూ హైదరాబాద్​ వాసి కోరాడు. నమ్మి సరేననడంతో నిలువునా ముంచేశాడు. ఓ కంపెనీలో మేనేజర్​గా పనిచేసే టోలిచౌకికి చెందిన మహమ్మద్ షోయబ్ ఖాన్​కు సౌత్ ఆఫ్రికాకు చెందిన పార్క్ గియాన్ ర్యాంగ్ సామాజిక మాధ్యమంలో పరిచయం అయ్యాడు. తాను ఇన్వెస్టర్ ఫర్ సౌత్ కొరియా సంస్థకు అధినేతగా ర్యాంగ్​ పరిచయం చేసుకున్నాడు. తన వ్యాపారాన్ని భారత్​లో విస్తరించాలనుందని... మంచి వ్యాపార భాగస్వామి కోసం అన్వేషిస్తున్నానని తెలిపాడు.

మంచి స్నేహితునివి నువ్వే కదా...

10 వేల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. భాగస్వామిగా ఉండాలని షోయబ్​లో ఆశలు రేకెత్తించాడు. "నువ్వు ఎలాగో నాకు మంచి స్నేహితుడివి కాబట్టి ఆ డబ్బు నీకే పంపిస్తా... అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా న్యాయవాది నీకు అర్ధమయ్యేలా చెబుతారు" అంటూ ఓ ఫోన్ నంబర్ ఇచ్చాడు. ర్యాంగ్ మాటలు నమ్మిన షోయబ్ ఈ న్యాయవాదికి ఫోన్ చేశాడు. అన్ని వివరాలు మాట్లాడుకున్నారు.

రూ.14 లక్షలకు టోకరా...

పది వేల మిలియన్ డాలర్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పంపించాల్సి ఉన్నందున... ఆర్బీఐకి కనీసం రూ.14 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఆ వ్యక్తి షోయబ్​కు వివరించాడు. ఆన్​లైన్​లో ఆ మొత్తాన్ని షోయబ్ బదిలీ చేశారు. ఆ తర్వాత సదరు వ్యక్తుల ఫోన్లు ఆగిపోవటం వల్ల మోసపోయానని గ్రహించిన షోయబ్... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.