హైదరాబాద్ మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని బీడీ రెడ్డి గార్డెన్, టీచర్స్ కాలనీల్లోని నిత్యావసర వస్తువుల గిడ్డంగులపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గడువు ముగిసిన, తిరస్కరించిన నిత్యావసర వస్తువులను, అక్రమంగా నిల్వ చేసిన 2,500 కిలోల గోధుమ పిండి, 2,500 కిలోల బొంబాయి రవ్వ, 20 బ్యాగుల బియ్యం,100 కిలోల జాంగ్రీ, 50 కిలోల చింతపండు,100 కిలోల చక్కెర, అల్లం,వెల్లుల్లి మొదలగునవి స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి బి.నర్సింహను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఇవీచూడండి: కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం