ETV Bharat / state

'త్వరలోనే లబ్ధిదారులందరికీ నూతన గృహాలు కేటాయిస్తాం' - minister talasani visits 2bed room

సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పేద ప్రజల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల  గదులను నిర్మిస్తోందని స్పష్టం చేశారు.

నిర్మాణ పనుల గురించి అధికారులను, స్థానికులను ఆరా తీసిన మంత్రి
author img

By

Published : Jun 24, 2019, 4:58 PM IST

సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో పేద ప్రజల కోసం నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనుల తీరుతెన్నుల గురించి అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులందరికీ గృహాలు కేటాయించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
మారేడ్​ పల్లి లాంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్​రూం ఇళ్లు రావడం పేదలకు కొండంత ఆసరా అని పేర్కొన్నారు. బస్తీవాసుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేసుకోవాలని మంత్రి సూచించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోనే అత్యధికంగా 1400 రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి అర్హులకు పట్టాలు అందజేస్తామని వివరించారు. దాదాపుగా 70 నుంచి 80 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఈ ప్రాంతమంతా మిని ముంబాయి లాగా అభివృద్ధి చెందుతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు.

పేద ప్రజల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గదులను నిర్మిస్తోంది : తలసాని

ఇవీ చూడండి : భాజపా ఆందోళనలో అపశృతి.. చెలరేగిన మంటలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.