ETV Bharat / state

Sonia Gandhi Hyderabad Tour : జూన్‌ మొదటి వారంలో హైదరాబాద్‌కు సోనియాగాంధీ - Gandhi Ideology Center in Secunderabad

Sonia Gandhi Hyderabad Tour : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జూన్‌ మొదటి వారంలో హైదరాబాద్‌ రానున్నారు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని పదెకరాల స్థలంలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ‘గాంధీ ఐడియాలజీ సెంటర్‌’ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి సోనియాతో పాటు రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర జాతీయ స్థాయి నాయకులను కూడా ఆహ్వానిస్తామని పీసీసీ వర్గాలు తెలిపాయి.

Sonia Gandhi
Sonia Gandhi
author img

By

Published : May 12, 2023, 9:30 AM IST

Sonia Gandhi Hyderabad Tour : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రంజుకుంటోంది. ఇప్పటికే తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు పోరాటాలు ముమ్మరం చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు వెళుతోంది. పార్టీ అధిష్ఠానం సైతం రాష్ట్రంపై పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Sonia Gandhi Hyderabad Tour in June : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పార్టీ కార్యకర్తలను కదనోత్సాహంలో పాల్గొనేలా చేస్తే.. ఈనెల 8న హైదరాబాద్​లో నిర్వహించిన ప్రియాంక గాంధీ బహిరంగ సభ నాయకులలో మరింత జోష్​ నింపిందనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జూన్​ మొదటి వారంలో హైదరాబాద్​ రానున్నట్లు తెలుస్తోంది. సోనియా పర్యటన పార్టీ శ్రేణులలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.

ఇంతకీ ఆమె ఎందుకు వస్తున్నారంటే : సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని పదెకరాల స్థలంలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ‘గాంధీ ఐడియాలజీ సెంటర్‌’ భవన నిర్మాణానికి సోనియా గాంధీ శంకుస్థాపన చేస్తారు. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి సోనియాతో పాటు రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర జాతీయ స్థాయి నాయకులను కూడా ఆహ్వానిస్తామని పీసీసీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. జూన్‌ 1న లేదా మొదటి వారంలో ఈ కార్యక్రమం ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

Gandhi Ideology Center in Secunderabad : వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి శివారులో సుమారు పదెకరాల స్థలం కేటాయించారు. అందులో గాంధీ ఐడియాలజీ సెంటర్‌ నిర్మాణానికి అనుమతి కోరుతూ పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి కంటోన్మెంట్‌ బోర్డుకు గతంలో దరఖాస్తు చేశారు. బుధవారం జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలి సమావేశంలో జీ ప్లస్‌ 2 భవనానికి అనుమతి ఇస్తున్నట్లు బోర్డు సీఈవో మధుకర్‌ నాయక్‌ ప్రకటించారు. అనుమతి లభించిన నేపథ్యంలో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని పీసీసీ భావిస్తోంది.

జాతీయస్థాయి అవసరాలకు ఉపయోగపడేలా భవన నిర్మాణం: ఈ భవనాన్ని పార్టీ జాతీయస్థాయి అవసరాలకు ఉపయోగపడేలా పీసీసీ డిజైన్‌ చేస్తోంది. గాంధీ భావజాలాన్ని తెలిపే లైబ్రరీతోపాటు పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా థియేటర్‌.. గాంధీ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ వచ్చినప్పుడు విడిది చేసేలా ఏర్పాట్లు.. ఏఐసీసీ అధ్యక్షుడికి ప్రత్యేక ఛాంబర్‌.. పార్టీ రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా నిర్మాణం ఉండబోతోందని పార్టీ వర్గాల సమాచారం. జీ ప్లస్‌ 2 అంతస్తులకు కంటోన్మెంట్‌ బోర్డు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఏయే సౌకర్యాలతో భవనాన్ని నిర్మించాలనే అంశంపై పార్టీలో సమాలోచనలు జరుగుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.