ETV Bharat / state

ఫిర్యాదులను వేగంగా పరిష్కరించండి:దాన కిశోర్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఫిర్యాదులు ఏవిధంగా వచ్చిన పరిష్కారంపై స్పందిచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికి వరకు వచ్చిన ఫిర్యాదుల్లో 80 శాతానానికి పైగా పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు.

ఫిర్యాదులను వేగంగా పరిష్కరించండి:దాన కిశోర్‌
author img

By

Published : Aug 22, 2019, 12:25 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సమస్యలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ప్రకటించారు. ఈ మేరకు స్వయం సహాయక బృందాల పనితీరుపై కూకట్‌పల్లిలో సమీక్షను నిర్వహించారు. ఫిర్యాదు ఏ విధంగా వచ్చిన స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికి వరకు వచ్చిన వాటిల్లో 80 శాతానానికి పైగా పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత వర్షకాలంలో అంటువ్యాధుల నివారణకు గ్రేటర్‌ పరిధిలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల్లో స్థానికులు పాల్గొనేలా ప్రచారం చేయాలని వివరించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేయాలన్నారు. స్వచ్ఛ ఆటోలుగా గుర్తింపులేని వాటిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.

ఫిర్యాదులను వేగంగా పరిష్కరించండి:దాన కిశోర్‌
ఇదీచూడండి: ప్రభుత్వం అందించిన సాయం గొప్పది: అమెజాన్​ ఇండియా వైస్​ ప్రెసిడెంట్​

TG_Hyd_58_21_GHMC_Review_Meeting_AV_3182301 Reporter: Karthik Script: Razaq ( 3260212 ) Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) హైదరాబాద్ మహానగరంలోని సమస్యలపై అందే ఫిర్యాదుల పరిష్కారంపై థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించనున్నట్టు జీహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ ప్రకటించారు. నగరంలో రోడ్ల మరమ్మతులు, ఫిర్యాదుల పరిష్కారం, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, ఆస్తిపన్ను సేకరణ, హరితహారం, స్వయం సహాయక బృందాల పనితీరు తదితర అంశాలపై కూకట్‌పల్లి జేఎన్‌టీయూ సమావేశమందిరంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని కమీషనర్ ఏర్పాటు చేశారు. నగరవాసులు ఎదుర్కొంటున్నసమస్యలపై వివిధ మార్గాల ద్వారా చేసే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రజావాణి, మై జీహెచ్ఎంసి యాప్, ట్విట్టర్, మెయిల్స్ తదితర మార్గాల ద్వారా అందే ఫిర్యాదుల్లో దాదాపు 80శాతంకు పైగా పరిష్కరిస్తున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయని, అయితే ఈ పరిష్కరించిన ఫిర్యాదుల్లో పది శాతం థర్డ్ పార్టి ద్వారా విచారణ జరిపించి క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రస్తుత వర్షకాలంలో అంటువ్యాధుల నిరోధానికి గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద త్తున వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, ఈ వైద్య శిబిరాలకు స్థానికంగా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి స్థానికులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలో దోమల నివారణకు చేపట్టిన వివిధ చర్యల్లో భాగంగా ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా నిర్వహిస్తున్న అంశం పట్ల అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను వేగవంతం చేయాలని, అవసరమైతే మూడు షిఫ్ట్ లుగా పనులు నిర్వహించి మరమ్మతు, పునరుద్దరణ పనులను పూర్తిచేయాలని దానకిషోర్ స్పష్టం చేశారు. స్వచ్ఛ ఆటోల అన్నింటిపై తిరిగి సర్వే నిర్వహించి కేటాయించిన ఆటోలు తిరగని వాటిని గుర్తించిన సంబంధిత లబ్దిదారులపై కేసులు నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు. నగరంలో 7లక్షల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ పొందుతున్న స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేయించి నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో సంఘాలను ఎంపిక చేయాలని దానకిషోర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమీషనర్లు డిప్యూటీ కమిషనర్లు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.