ETV Bharat / state

కరోనా కట్టడికి సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ కృషి - corona latest news

కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యసిబ్బంది రక్షణకు హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసిన ఆవిష్కరణ ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రానిక్స్, హార్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా... ఆయా రంగాలపై ఉన్న మక్కువతో కొవిడ్-19 నుంచి కాపాడుకునేందుకు.. పలు పరిష్కారాలు కనుగొన్నాడు. వైద్యసిబ్బంది సహా బాధితులకూ ఉపయోగపడేలా వీటిని రూపొందించినట్లు ఆవిష్కర్త తెలిపారు.

software engineer New inventions for corona eradication
కరోనా కట్టడికి సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ కృషి
author img

By

Published : May 4, 2020, 6:11 PM IST

ప్రపంచాన్ని గడగలాడిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషి అనిర్వచనీయం. బాధితులకు చికిత్స అందిస్తూ... వైరస్‌ సోకి ఇప్పటికే పలుచోట్ల వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రక్షణకు హైదరాబాద్‌ బాచుపల్లికి చెందిన భానుచందర్‌ పలు ఆవిష్కరణలు చేశాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో క్వారంటైన్‌లో ఉన్న వారి పర్యవేక్షణకు మనుషుల ప్రమేయం తగ్గించేలా పలు డిజైన్లు తయారు చేశాడు. ఐసీయూలోని రోగులకు ఆహారం, మందులు అందించేందుకు తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబో ఎంతో ఆకట్టుకుంటోంది. వైద్యసిబ్బంది ప్రతిసారి రోగుల వద్దకు వెళ్లాల్సిన అవసరంలేకుండా రోబో ద్వారా అందించేలా ఏర్పాటు చేశాడు.

సెన్సార్లతో పనిచేసే హ్యాండ్‌వాష్ డిస్పెన్సర్​

కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం చేతులు కడుక్కోవటం, సానిటైజ్ చేసుకోవటం తప్పనిసరైంది. ఇందుకు సెన్సార్లతో పనిచేసే హ్యాండ్‌వాష్ డిస్పెన్సర్, మెకానికల్ సానిటైజర్ డిస్పెన్సర్‌తయారు చేశాడు. వాటిద్వారా ఆస్పత్రలు, కార్యాలయాల్లో ఒకరి కన్నా ఎక్కువ మంది లిక్విడ్ సోప్, సానిటైజర్‌ను చేతితో నొక్కకుండానే శుభ్రం చేసుకోవచ్దు. వీడియోరోవర్‌తో క్వారంటైన్‌లో ఉన్నవారిని నిత్యం పర్యవేక్షించవచ్చు. వారితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ... సలహాలు ఇవ్వొచ్చు. ఇవన్నీ వైఫై, బ్లూటూత్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. వీటికి ఆదేశాలిచ్చే అప్లికేషన్‌నూ భాను సొంతంగా తయారు చేశాడు. వాటన్నింటిని అతితక్కువ ఖర్చుతో.. మొబైల్ ద్వారా ఆపరేట్ చేసే వీలుంటుంది.

రోబోటిక్స్‌పై ఆసక్తితో

స్వతహాగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన భాను.. రోబోటిక్స్‌పై ఆసక్తితో వాటిని తయారుచేశాడు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మెలకువలు నేర్చుకున్నట్లు చెప్పాడు. మానవ మనుగడకే కరోనా వైరస్‌ సవాల్‌ విసురుతున్న సమయంలో ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి వేడుకలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.