ETV Bharat / state

నల్లకుంటలో రోడ్డు ప్రమాదం... సాఫ్ట్​వేర్ ఉద్యోగి మృతి - నల్లకుంట రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్​వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్ నల్లకుంట మెయిన్​రోడ్డులో ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి వేగంగా ద్విచక్రవాహనాన్ని నడుపుతూ వెళ్లి ఓ స్తంభానికి ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

software employee died in bike accident
నల్లకుంటలో రోడ్డు ప్రమాదం... సాఫ్ట్​వేర్ ఉద్యోగి మృతి
author img

By

Published : Aug 11, 2020, 12:44 PM IST

హైదరాబాద్ నల్లకుంట మెయ్​రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సౌత్ లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఎండ్రిక్ హఠన్ అనే సాఫ్ట్​వేర్ ఉద్యోగి మృతి చెందాడు. రోజులాగే ఉద్యోగ నిమిత్తం ఆఫీసుకు బయలుదేరిన హఠన్​... అధిక వేగంతో ద్విచక్రవాహనాన్ని నడిపాడు. నల్లకుంట మెయిన్​ రోడ్డు వద్దకు చేరుకోగానే ఓ స్తంభానికి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంనతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.