ETV Bharat / state

ఉద్యోగం కావాలంటే నగ్నచిత్రం పంపమనేవాడు - claimat raju

నిత్యం ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నా కొందరు మహిళలు కేటుగాళ్ల మాయలో సులువుగా పడిపోతున్నారు. విద్యావంతులైనా... ఉద్యోగం వస్తుందనే ఆశతో మాయగాళ్ల వలలో చిక్కుతున్నారు. ఉద్యోగాలిప్పిస్తానని మభ్యపెట్టి ఓ కేటుగాడు రెండువేల మంది మహిళల ఫోటోలు సేకరించి... తద్వారా వారి నగ్న చిత్రాలు సమీకరించాడు. 16 రాష్ట్రాల్లో యువతులను మోసం చేశాడు. చివరకు హైదరాబాద్​కు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు.

ఉద్యోగం పేరుతో నగ్నచిత్రం పంపమన్న మృగాడు అరెస్ట్​
author img

By

Published : Aug 23, 2019, 8:59 PM IST

Updated : Aug 23, 2019, 9:07 PM IST

సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వందలాదిమంది మహిళల జీవితాలతో ఆడుకున్న ఓ మృగాడి పాపం పండింది. చదివింది ఉన్నత విద్య. చేసేది సాఫ్ట్​వేర్​ ఉద్యోగం. అదికూడా పెద్ద సంస్థలో.. పైకి ఎంతో హుందాగా కనిపించే ఆ కీచకుడిలో కనిపించని మృగాడు ఉన్నాడు. చెన్నైకి చెందిన క్లైమెట్ రాజు అలియాస్ ప్రదీప్ సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల వివరాలు సేకరించి ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికేవాడు. మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో అతను చెప్పినట్లుగా చేసి వందలాదిమంది చిక్కుల్లో పడ్డారు.

ఇంతమందిని ఎలా మోసం చేశాడంటే...

ఉద్యోగంకోసం దరఖాస్తు చేసుకున్న మహిళల వివరాలు సేకరించి వారిని ఫోనులో సంప్రదించేవాడు. ఓ ప్రముఖ హోటల్​లో రిసెప్షనిస్టు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేవాడు. మరిన్ని వివరాల కోసం హోటల్​కు చెందిన ఓ మహిళా ప్రతినిధి మిమ్మల్ని వాట్సాప్​ ద్వారా సంప్రదిస్తుందని చెప్పేవాడు. తానే మహిళగా పరిచయం చేసుకుని ఉద్యోగార్థులతో చాటింగ్​ చేసేవాడు. ఉద్యోగం కోసం ఫోటోలు పంపాలని కోరేవాడు. పూర్తి వివరాలు పంపిన తర్వాత శరీరాకృతి తెలుసుకోవాలని పొట్టి దుస్తులు వేసుకుని ఫోటోలు పంపమనేవాడు. ఉద్యోగం వస్తుందని చాలా మంది అలాగే పంపారు. తర్వాత మీరు మొదటి దశలో ఎంపికయ్యారని శరీర దృఢత్వం తెలుసుకోడానికి నగ్నచిత్రాలు పంపాలని కోరేవాడు. తాము పంపుతున్నది మహిళకే కదా అనుకుని అడిగినట్లుగా చాలా మంది నగ్నచిత్రాలు పంపేవారు. ఆ తర్వాతే అసలు ముసుగు తీసి నిజస్వరూపం బయటపెట్టేవాడు.

ఫోటోలు పంపిన వారికి వీడియోకాల్​చేసి మాట్లాడతాడు. రిసెప్షనిస్ట్​గా తుది దశ ఎంపిక చేయడానికి అర్హతలు తెలుసుకునేందుకు నగ్నంగా కనపడాలని చెప్పేవాడు. పంచతార హోటల్​లో పనిచేయాలంటే ఇవన్నీ తప్పవని నమ్మబలికేవాడు. మంచి ఉద్యోగం కదా అన్న ఆశతో కొందరు అతను చెప్పినట్లే చేశారు. వాటిని రికార్డిగ్​ చేసి వేధింపులకు గురిచేసేవాడు.

పాపం పండిందిలా...

మియాపూర్​కు చెందిన ఓ మహిళకు ఇదేవిధంగా ఫోన్​రావడం వల్ల అనుమానం వచ్చి ఏప్రిల్​ 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫేస్​బుక్​ ఖాతా ఐపీ నంబరు ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు చెన్నై వెళ్లి అరెస్టు చేశారు. ల్యాప్​టాప్​, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రెండువేల మంది మహిళల నగ్న చిత్రాలు. మూడొందల మంది నగ్నదృశ్యాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్లకింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

మోసపోకండి...

నిందితుడు 16 రాష్ట్రాల్లో మహిళలు, యువతులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. కానీ ఎక్కడా నిందితుడిపై ఫిర్యాదులు లేవని మియాపూర్​ పోలీసులు తెలిపారు. ఉద్యోగాలిప్పిస్తామంటూ ఈ తరహా మాయమాటలు నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఉద్యోగం కావాలంటే నగ్నచిత్రం పంపమన్న మృగాడు అరెస్ట్​

ఇదీ చూడండి: ఆ వివరాలన్నీ ఆన్​లైన్​లో ఇవ్వాల్సిందే..

Intro:TG_ADB_34_23_ATMAHATYA_YATNAM_AVBB_TS10033
TG_ADB_34a_23_ATMAHATYA_YATNAM_AVBB_TS10033
సాగుభూమి లాకుంటున్నారంటూ రైతు ఆత్మహత్యయత్నం..

తాను సాగు చేస్తున్న భూమిని ప్రభుత్భం లాక్కునే ప్రయత్నం చేస్తుందంటూ ఓ రైతు తన పంట పొలాల్లో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య యత్నం చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లాలో కాటుచేసుకుంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామాల్లోని ఇర్ల సాయన్న అదే గ్రామానికి చెందిన తోట ఎర్రబాయికి చెందిన 227/8 సర్వే నెంబరులోగల 5 ఎకరాల భూమిని 2002లో కొనుగోలు చేసాడు.అప్పటి నుండి ఇర్ల సాయన్న సాగు చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఎర్రబాయి నాభూమంటూ పిర్యాదు చేయగా గ్రామ కమిటీ సభ్యులు ఒకరికి కేటాయించిన ప్రభుత్వ భూమిని మరొకరు ఎట్లా కొంటారు ఆభూమిని గ్రామావసరాలకు కోటాయించాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో పిర్యాదు చేసారు. దీంతో రెవెన్యూ అధికారులు వ్యవసాయం చేసుకుంటున్న ఈర్ల సాయన్నను అడ్డుకొని అందులో ఉన్న కరెంట్ స్టార్టర్ ను తీసివేశారు . ఈ క్రమంలో మనస్థాపానికి గురైన ఆయన తనను వేధిస్తున్నారంటూ అక్కడే ఉన్న పురుగులమందు సేవించి ఆత్మహత్య యత్నం చేశాడు. కుటుంబ సభ్యులకు తెలియడంతో చికిత్స నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు .ఇక్కడ వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ కు తరలించారు .ఈర్ల సాయన్న కుమారుడు మీడియా ముందు తన ఆవేదనను వెళ్లబుచ్చుతున్నాడు. 16 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిని ఇప్పుడు మాకు కాకుండా చేయాలని అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు .గత ఎన్నికల్లో వారికి మద్దతుగా పనిచేయాలని కక్ష సాధింపులు చేస్తున్నారని ఆవేదన చెందారు. రైతులపై కేసుల పేరట అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారని అన్నారు. గత రెండు నెలల క్రితం తమ పంట పొలంలో గ్రామ కమిటీ సభ్యులు దౌర్జన్యంగా దున్నేసారని పోలీసులకు,రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే రెండు నెలలు గడిచినా వారిపై చర్యలు తీసుకోలేదు. కానీ తమపై మాత్రం జూలూమ్ చేస్తున్నారని అందుకు తన తండ్రి ఈ రోజు ఆత్మహత్యాయత్నం చేశాడని ఆవేదన వెళ్లబుచ్చాడు.
బైట్
విజయ్. బాధిత రైతు కుమారుడు
ప్రభాకర్. తహసీల్దార్, సారంగాపూర్, నిర్మల్ జిల్లా

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ హిట్ నెంబర్ 714
Last Updated : Aug 23, 2019, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.