ETV Bharat / state

చదువుకుంటూనే సేవా కార్యక్రమాలు.. రచయితగానూ గుర్తింపు

విద్యార్థులంటే సాధారణంగా చదువు, పరీక్షలు, ఆటపాటలు.. ఇవే వారి ప్రపంచం. కానీ హైదరాబాద్​ నగరంలోని ఎర్రగడ్డ సమీప కల్యాణి నగర్‌కు చెందిన పదిహేడేళ్ల ఇషా ఉప్పలపాటి మాత్రం చదువుతోపాటు సామాజిక సేవకూ ప్రాధాన్యమిస్తూ స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్‌ పూర్తిచేసిన ఈ అమ్మాయి అమెరికాలోని అట్లాంటాలో ఉంటూ బాలికల విద్య కోసం ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. మన నగరంలోని ఇద్దరు పేద విద్యార్థుల చదువుకూ సాయపడింది. చక్కటి రచనలూ చేస్తోంది.

social servicer esha uppalapati successful inspirational story
చదువుకుంటూనే సేవా కార్యక్రమాలు.. రచయితగానూ గుర్తింపు
author img

By

Published : Nov 9, 2020, 10:43 AM IST

అమెరికాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న ఏడుగురు మహిళల జీవిత గాథలతో 'హర్‌ టూల్‌ బాక్స్‌' పుస్తకాన్ని ఇషా రాసింది. కంపెనీలో చిన్నస్థాయి నుంచి సీఈవో స్థాయికి ఎదిగిన మహిళతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్నవారితో ముఖాముఖి నిర్వహించి స్ఫూర్తి కలిగించే అంశాలను రచనలో పొందుపరిచింది. ఇషా తండ్రి యు.సుహాస్‌ అమెరికాలోని అంబులెన్స్‌ సర్వీసెస్‌ సంస్థలో సీఈవో కాగా, తల్లి మధురిమ ఓ ఆసుపత్రికి ఛైర్మన్‌. తాతయ్య డా.సుబ్బారావు అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగాధిపతిగా గతంలో పనిచేశారు.

ఆలోచన అలా మొదలై..

కార్లను శుభ్రంచేసే సంస్థతోపాటు, బేక్‌సేల్స్‌ కంపెనీని సోదరి రియాతో కలిసి ఇషా ప్రారంభించింది. నిధులను సేకరించి సమాజ సేవకు వినియోగిస్తోంది. ఆన్‌లైన్‌ విద్యకు దూరంగా ఉన్నవారికి ఐపాడ్‌లను ఇస్తోంది. 'గర్ల్‌ ఫ్రాంటియర్‌' సంస్థను ఏర్పాటుచేసి పేద కుటుంబాల బాలికలకు విద్యను అందిస్తోంది. పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునే యువతులకు నైపుణ్యాలనూ నేర్పిస్తోంది.

social servicer esha uppalapati successful inspirational story
తన రచనతో ఇషా ఉప్పలపాటి

నిధుల సేకరణ ఎలా అంటే..

నిధులను సేకరించేందుకు ఇషా వినూత్న పద్ధతులను అవలంభిస్తోంది. సొంతంగా తయారుచేసిన కేక్‌లు, బిస్కట్లు పాఠశాలల వద్ద అమ్ముతుంది. ఇరుగు పొరుగువాళ్లు ఊరెళ్లినప్పుడు వారి మెయిల్‌ బాక్స్‌ నిండిపోతే వాటిని తీసి భద్రపరిచి 5 డాలర్లు వసూలుచేస్తోంది. శని, ఆదివారాల్లో తండ్రి కార్యాలయానికి వెళ్లి చిన్నచిన్న పనులు చేసి డబ్బు సంపాదిస్తోంది. క్లీనర్ల సాయం లేకుండా ఇళ్లను శుభ్రంచేసి వేతనం వసూలుచేస్తుంది. పుట్టినరోజు వేడుకలకు బుడగలు అమ్మడం వంటి పనులతో తన స్వచ్ఛంద సంస్థకు నిధులు సేకరిస్తోంది. పారిశ్రామికవేత్తలుగా రాణించే మహిళలకు అందించే 'ట్రయాంగిల్‌ బిజినెస్‌ జర్నల్‌ వరల్డ్‌ అవార్డు'ను ఇషా అందుకుంది.

ఇదీ చదవండిః తొలి మహిళా మైన్​ మేనేజర్​కు ఎమ్మెల్సీ కవిత అభినందన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.