Post against YSRCP MLA Vasanth Krishna Prasad : వసంత కృష్ణప్రసాద్.. ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇయనపై ముఖ్యమంత్రి జగన్ చేయి చేసుకున్నారంటూ ఓ పోస్టు... సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమంటూ వైకాపా శ్రేణులు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ఈ విషయం ఎమ్మెల్యే వరకు చేరటంతో.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదంతా అతని పనేనా..?
ఎమ్మెల్యే ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు.. కూపీని లాగే పనిలో నిమ్మగ్నయమ్యారు. ఈ పోస్టుకు సంబంధించిన మూలాలు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రచారం వెనుక ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు యువతలో పని చేస్తున్న ఓ కీలక నాయకుడి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సదరు వ్యక్తి అందుబాటులో ఉండకపోవడంతో.. అనుమానాలు బలపడుతున్నాయి.
ఇదీ చూడండి : KTR Comments on Modi : 'మోదీకి మరో అవకాశమిస్తే.. తెలంగాణ-ఆంధ్రాను కలిపేస్తారు'