ETV Bharat / state

భౌతిక దూరం.. నిజాం కాలం నుంచే! - వందేళ్ల క్రితమే వాడిన క్వారంటైన పదాలు

బయటకు రాకపోవడం, క్వారంటైన్లో ఉండటం కరోనా సమయంలో వచ్చిన పదాలేమీ కావు. వందేళ్ల క్రితమే ప్లేగు వ్యాధిని నివారించేందుకు భౌతిక దూరాన్ని అస్త్రంగా చేసుకున్నారు నిజాం పాలకులు. అప్పట్లోనే క్వారంటైన్ ఆసుపత్రి ఏర్పాటు చేసి రోగులను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

SOCIAL DISTNACE AND QUARANTINE WORDS
భౌతిక దూరం.. నిజాం కాలం నుంచే!
author img

By

Published : Apr 14, 2020, 2:53 PM IST

భౌతిక దూరం(సోషల్‌ డిస్టెన్స్‌) పాటించండి.. ఇళ్ల నుంచి బయటికి రాకండి అంటూ కొన్నాళ్లుగా ప్రభుత్వాలు ప్రతిరోజూ హెచ్చరిస్తూనే ఉన్నాయి. భౌతిక దూరం అనే ఈ పదం మాత్రం కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే వచ్చింది కాదని.. నిజాం హయాంలోనే ఇది పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. ‘హైదరాబాద్‌ రాజ్యంలో అంటువ్యాధులు ప్రబలిన సమయంలోనే భౌతిక దూరం పాటించడం మొదలైంది. ప్లేగు వ్యాధి నగరంలో విజృంభిస్తున్న తరుణంలో అప్పటి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రజలు సామాజిక దూరం పాటించేలా చాకచక్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల సాన్నిహిత్యం లేకుండా నగర రూపు రేఖల్ని మార్చే ప్రయత్నం చేశారు. తద్వారా ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.

‘ఆ కాలంలో మురికి వాడలు, ఇళ్లు చాలా దగ్గరగా ఉండేవి. దీంతో వ్యాధి వ్యాప్తికి ఆస్కారం ఉందని తెలియడంతో హుటాహుటిన నగరానికి కొత్త రూపు ఇచ్చే మ్యాప్‌ను నిజాం సిద్ధం చేయించారు. కాలనీల విస్తరణ, ఇళ్ల మధ్య దూరం ఉండేలా నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులతో కలిసి కసరత్తు చేయించారు. మురికివాడలను తొలగించారు. జనసాంద్రత తగ్గేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను అప్పట్లో తీసుకున్నారు’ అని కాలిఫోర్నియాలో ‘అర్బన్‌ మోర్ఫోలజీ ఇన్‌ హైదరాబాద్‌’ అనే అంశంపై అధ్యయనం చేస్తున్న కెవిన్‌ హెనెస్‌ తెలిపారు. ఇదే విషయాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విశ్రాంత చరిత్ర అధ్యాపకులు ప్రొఫెసర్‌ అడపా సత్యనారాయణ ధ్రువీకరించారు. ‘ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలోనే వ్యక్తిగత శుభ్రత, భౌతికదూరం అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

దేశంలో తొలి క్వారంటైన్‌ ఆసుపత్రి ఇక్కడే..

నగరంలోని వీధుల్ని శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికుల కోసం నిజాం ప్రభువు ఖైరతాబాద్‌లో ప్రత్యేక కాలనీ నిర్మాణాన్ని చేపట్టారు. నగరాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం సామాజిక కార్యకర్తలు చేస్తున్న పనుల్నే అప్పట్లో దక్కన్‌ హ్యుమానిటేరియన్‌ లీగ్‌ ద్వారా భాగ్యరెడ్డి వర్మ చేపట్టారు. ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవలతో పాటు చనిపోయినవారి దగ్గరకు ఎవరూ రాకపోతే దహన సంస్కారాలు చేపట్టారు. క్వారంటైన్‌ అనే పదం కూడా ఆ కాలంలోనే ఎక్కువగా వినిపించేది. 1908లో మూసీ వరదలు వచ్చిన సమయంలో కాలుష్యం కారణంగా అనేక అంటురోగాలు ప్రబలాయి. కొత్త జ్వరాలు, గత్తర(కలరా) వ్యాపించి మరణాల సంఖ్యను రెట్టింపు చేశాయి.

వీటి నివారణకు 1915లో నగరానికి దూరంగా ఉన్న ఈరన్న గుట్ట వద్ద ఒక చిన్నపాటి ఆసుపత్రిని నిర్మించారు. అంటువ్యాధులు ఒక రోగి నుంచి మరొకరికి సోకకుండా వారిని క్వారంటైన్‌లో ఉంచే పద్ధతిని ప్రారంభించారు. అప్పట్లో దీన్ని క్వారంటైన్‌ ఆసుపత్రి అని పిలిచేవారు. అలా దేశంలో మొదటి క్వారంటైన్‌ ఆసుపత్రి ఇక్కడే ప్రారంభమైంది. కాలక్రమేణా ఇది ప్రస్తుత కోరంటి ఆసుపత్రిగా ప్రఖ్యాతి పొందింది. 1923 తర్వాత ప్రస్తుతమున్న ప్రాంతానికి ఆసుపత్రిని మార్చారు’.

ఇవీ చూడండి: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.