Smita Sabharwal Tweet on Central Deputation Rumours : సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ (Smita Sabharwal) కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటేషన్‌పై వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా ఆమె ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని తెలిపారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గానే విధులను నిర్వహిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర సర్కార్ ఏ బాధ్యత ఇచ్చిన చేస్తానని వివరించారు. తెలంగాణ ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాని స్మితా సభర్వాల్ వెల్లడించారు.
-
I see some news channels have reported a fake news- that I am going for central deputation, which is widely circulated.
— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
It is totally false and baseless.
As an #IAS officer of Telangana cadre, I will continue to serve and execute whatever responsibility the Government of…
">I see some news channels have reported a fake news- that I am going for central deputation, which is widely circulated.
— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023
It is totally false and baseless.
As an #IAS officer of Telangana cadre, I will continue to serve and execute whatever responsibility the Government of…I see some news channels have reported a fake news- that I am going for central deputation, which is widely circulated.
— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023
It is totally false and baseless.
As an #IAS officer of Telangana cadre, I will continue to serve and execute whatever responsibility the Government of…
Smita Sabharwal Tweet Today : మరోవైపు బుధవారం స్మితా సభర్వాల్, ఎక్స్‌లో (ట్విటర్) చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై 23 సంవత్సరాలు అయిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఎంత ముందుకు వెళ్లామో కొన్ని చిత్రాలు గుర్తు చేస్తాయంటూ ఓ పోస్టు పెట్టారు. ఓ యువతి తన అభిమతానికి అనుగుణంగా, ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమిస్తూ 23 ఏళ్లుగా ప్రయాణం సాగిస్తోందని, ఇన్నాళ్లుగా తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు అంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
-
Some pics remind us how far we have come..
— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will!
Thanks to all your love ♥️,
ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYv
">Some pics remind us how far we have come..
— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023
through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will!
Thanks to all your love ♥️,
ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYvSome pics remind us how far we have come..
— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023
through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will!
Thanks to all your love ♥️,
ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYv
Officers Transfers in Telangana 2023 : త్వరలోనే ఆ 100 మంది అధికారుల బదిలీ..!
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్, రజత్ కుమార్ పదవీ విరమణ అనంతరం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. అయితే కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె ఇప్పటి వరకూ కలవలేదు. ఇటీవల నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సమీక్షకు కూడా హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆమె చేసిన ట్వీట్‌పై కొన్ని మీడియా సంస్థలు ఆమె డిప్యూటేషన్‌పై కేంద్రంలో విధులు నిర్వహించేందుకు వెళ్తున్నారంటూ వార్తలు ప్రసారం చేశాయి. ఈ విషయంపైనే తాజాగా స్మితా సభర్వాల్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
IAS and IPS Transfers in Telangana 2023 : మరోవైపు త్వరలో తెలంగాణలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా అధికారుల వివరాలు, సర్వీస్ రికార్డులు, ఇంటెలిజెన్స్ రిపోర్టులను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెప్పించుకుంటున్నారు. భారీ ఎత్తున జరగనున్న ఈ బదిలీలపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం కొద్ది మంది అధికారులకు మాత్రమే పోస్టింగులు ఇచ్చిన ముఖ్యమంత్రి, మిగతా వాటి విషయమై విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మరో ఇద్దరు లేదా ముగ్గురు కార్యదర్శులను నియమించుకోవడంతో పాటు కార్యదర్శులు(Secretaries), హెచ్ఓడీల పోస్టింగులు చేపట్టాల్సి ఉంది. కొన్ని పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉండగా, మరికొన్ని పోస్టింగుల్లో మార్పులు, చేర్పులు చేయాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఈ దిశగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వివరాలపై సీఎం ఆరా తీస్తున్నారు.
Mission Bhageeratha: ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దడి రావొద్దు: స్మితా సబర్వాల్
ధైర్యం, చాకచాక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను: స్మితా సబర్వాల్