Smart Phone Effect on human: హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె వంటి మెట్రోనగరాల్లో ‘మానవ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్ ప్రభావం’ అంశంపై అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 1,100 మందిని ప్రశ్నించగా కుటుంబ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్ ప్రభావం తీవ్రంగా ఉందని ఎక్కువ మంది అంగీకరించారు. కొవిడ్ తర్వాత పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని తెలిపారు. నలుగురు మనుషులు ఉన్న ఇల్లు ఒకప్పుడు ఆనందాలతో, కేరింతలతో సందడి, సందడిగా మారిపోయేది. కష్టసుఖాలతోపాటు, భవిష్యత్తు పరిణామాల గురించి చర్చిస్తూ, సరదాగా గడిపేవారు. ప్రస్తుతం పక్కపక్కన కూర్చున్న పలకరించడానికి సమయం లేనంత హడావుడిగా మారిపోయామని ముఖ్యంగా పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య బంధాలు సరిగా ఉండటం లేదని తెలిపారు.
వెల్లడైన వివరాలు..

ఇదీ చూడండి: వాట్సాప్లో మూడు టిక్కుల ఫీచర్.. నిజమెంత?