Slum Children at Book Fair: హైదరాబాద్‌లోని పలు మురిక వాడల చిన్నారులను హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు తీసుకురాగా... వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏకలవ్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ అక్షయ విద్య అనే పేరుతో నగరంలోని మురికివాడల చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి పనిచేస్తోంది. 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన శాలకు నగరంలోని కొన్ని అక్షయ విద్య కేంద్రాల నుంచి ఆయా చిన్నారులను తీసుకువచ్చి పుస్తకాల పట్ల అవగాహన కల్పించారు.
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉండే ఆయా విద్యార్థులను ఈ పుస్తక ప్రదర్శనశాలకు తీసుకురావడానికి గానూ... ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి నిర్వాహకులు తీసుకువచ్చారు. వెంటనే ఆర్టీసీ ఎండీ స్పందించి... వేర్వేరు ప్రాంతాల్లోని ఆయా విద్యార్థులను ఈ ప్రదర్శన శాల తీసుకురావడానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. పుస్తక ప్రదర్శనశాలలో విద్యార్థులందరూ కలియతిరుగుతూ తమకు నచ్చిన పుస్తకాలను చూస్తూ.. సందడి చేశారు. ఏకలవ్య ఫౌండేషన్... చిన్నారులకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేసి వారికి ఇచ్చింది. నగరంలోని ఎల్బీనగర్ నుంచి మొదలుకొని బోరబండ వరకు ఉన్న 140 అక్షయ విద్య కేంద్రాలు పని చేస్తున్నాయి.
ఇవీ చూడండి:
TSRTC New Offer : పుస్తక ప్రియులకు తెలంగాణ ఆర్టీసీ ఆఫర్
ఇదీ చదవండి : సాహితీ ప్రియుల కోసం సదాసిద్ధం... ఈనెల 18 నుంచి బుక్‌ఫెయిర్