ETV Bharat / state

Six People Suicides in One Day in Hyderabad : హైదరాబాద్‌లో ఆత్మహత్యల అలజడి.. రెండు ఫ్యామిలీలు.. ఆరుగురి బలవన్మరణాలు - Six suicides in one day in Hyderabad

Six People Suicides in One Day in Hyderabad : రాష్ట్ర రాజధానిలో రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి ఇద్దరు కుమార్తెలు, తల్లి ఇద్దరు కుమారులు బలవన్మరణం చెందడం స్థానికులను కలచి వేసింది. ఈ ఘటనలో అభం, శుభం తెలియని 8, 6, 4, 2 సంవత్సరాల వయసు గల నలుగురు చిన్నారులు మృతి చెందడం స్థానికులను కలచి వేసింది. బోయిన్‌పల్లి భవానీనగర్‌లో తండ్రి తాను సైనైడ్‌ తాగి, ఇద్దరు కుమార్తెలకు సైనైడ్‌ తాగించడంతో ముగ్గురు మృతి చెందారు. బోరబండ రాజ్‌నగర్‌లో తల్లి.. తన ఇద్దరు కుమారులకు విషం తాగించి, తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలతో కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Hyderabad
Suicides
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 8:00 PM IST

Updated : Oct 13, 2023, 10:00 PM IST

Six People Suicides in One Day in Hyderabad హైదరాబాద్‌లో ఆత్మహత్యల అలజడి.. రెండు ఫ్యామిలీలు.. ఆరుగురి బలవన్మరణాలు

Six People Suicides in One Day in Hyderabad : హైదరాబాద్‌లోని బోరబండ రాజ్‌నగర్‌లో తల్లి, ఇద్దరు కుమారుల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. సెంట్రింగ్‌ మేస్త్రిగా పనిచేస్తున్న విజయ్‌, తన భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఆదిత్య, అర్జున్‌తో కలిసి నివసిస్తున్నాడు. జ్యోతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అయితే పెద్ద కుమారుడు ఆదిత్య సరిగా నడవలేకపోవడం, చిన్న కుమారుడు అర్జున్‌కు మాటలు రాకపోవడం ఈ రెండు పరిణామాలతో ఆమె మానసిక వేదనకు గురయ్యేదని కుటుంబసభ్యులు తెలిపారు.

Mother and Two Sons Commit Suicide in Borabanda : దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో జ్యోతి తన ఇద్దరు కుమారులకు పాలలో విషం కలిపి ఇచ్చి.. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Commit Suicide) పాల్పడింది. తల్లి, ఇద్దరు కుమారులు విగత జీవులుగా పడి ఉండగా బంధువులు గమనించి ఇతర కుటుంబసభ్యులకు, భర్తకు సమాచారం అందించారు. వారు ఇంటికి చేరుకుని చూసే సరికి అప్పటికే వారు ముగ్గురు మృతి చెందారు. జ్యోతి భర్త విజయ్‌.. భార్య కుమారులు మృతదేహాలను చూసి తాను కూడా విషం తాగాడు. దీంతో పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శోకసంద్రంలో మునిగిపోయిన విజయ్‌ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

Wife And Husband Suicide In Medak : కుటుంబ కలహాలతో భార్య.. కాపాడపోయి భర్త..

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలిసిన స్థానికులు, కుటుంబ సభ్యలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో రాజ్‌నగర్‌లో విషాధచాయలు అలుముకున్నాయి. అయితే అంతకు ముందు పోలీసులు దీని వెనుక ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే కుమారుల ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన తీవ్ర మానసిక ఒత్తిడితో.. తల్లి జ్యోతి కుమారులకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Father and Two Daughters Commit Suicide Bowenpally : మరో ఘటనలో ఆర్థిక సమస్యల కారణంగా తలెత్తిన కుటుంబ కలహాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడ్సిన తండ్రి ఇద్దరు కుమార్తెలను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్‌పల్లి (Bowenpally) పీఎస్ పరిధిలోని భవానీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వెండి వస్తువులు తయారు చేసే శ్రీకాంతాచారి, తన భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సికింద్రాబాద్‌లో అద్దె దుకాణంలో వెండి వస్తువులు తయారు చేసి విక్రయించేవాడు. ఈ క్రమంలో 24 ఏళ్ల క్రితం అతని ఎడమ చేతి తెగి పోయింది. ఆ తర్వాత ఒక చేతితోనే తన వృత్తి పనులు చేసేవాడు.

భవానీనగర్‌లో రెండంతస్థుల ఇంటిలో మొదటి అంతస్థుల్లో తల్లి.. పైన గదిలో శ్రీకాంతాచారి ఉంటున్నాడు. రోజులాగే భోజనం చేసిన తర్వాత శ్రీకాంతాచారి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రపోయాడు. తెల్లవారుజామున లేచి చూసే సరికి భర్త, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించిన భార్య వెంటనే అత్తతో పాటు.. ఇరుగు పొరుగు వారికి విషయాన్ని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ఉరివేసుకుని భార్య.. రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం

మృతదేహాలను గాందీ మార్చురీకి (Gandhi Hospital) తరలించారు. రెండు నెలల క్రితం శ్రీకాంతాచారి వ్యాపారం కోసం తల్లి దగ్గర రూ.10 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బును వికలాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పిస్తానంటే ఓ దళారికి ఇచ్చాడు. ఉద్యోగం రాకపోవడంతో దళారి రూ.8 లక్షలు శ్రీకాంతాచారికి చెల్లించగా... మిగతా రూ.2 లక్షలు రావాల్సి ఉంది. ఇదే విషయంలో భార్య, భర్తల మధ్య గొడవలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

suicides in Hyderabad : గురువారం రాత్రి శ్రీకాంతాచారి తన షాపు నుంచి సైనైడ్ తీసుకొచ్చి.. భార్య, పిల్లలు గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత కుమార్తెల నోట్లో పోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత భార్య నోట్లో పోసినా... పక్కకు పడిపోయింది. తర్వాత అతను సైతం సైనైడ్ సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గాఢ నిద్రలో ఉన్న భార్య, శ్రీకాంతాచారి తన నోట్లో సైనైడ్ పోసే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా గుర్తించలేకపోయింది. తెల్లవారుజామున నిద్రలేచే సరికి పిల్లలు, భర్త మృతి చెందినట్లు ఆమె పోలీసులకు తెలిపింది.

విషాదం... ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

మూణ్నెళ్ల పసికందును హతమార్చి.. దంపతుల బలవన్మరణం

Last Updated : Oct 13, 2023, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.