Mahesh Bank Server Hacking Case: మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో మరో ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు నైజీరియన్లు సహా మరో నలుగురు అరెస్టయ్యారు. సైబర్ నేరగాళ్లకు నిందితులు బ్యాంకు ఖాతాలు సమకూర్చినట్లు తెలుస్తోంది. మహేశ్ బ్యాంక్ కేసులో ఇప్పటివరకు 14 మంది అరెస్టయ్యారు.
జనవరి 24న హైదరాబాద్ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై సైబర్ నేరగాళ్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ మెయిన్ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు... ఏకంగా రూ.12 కోట్లు మాయం చేశారు. అక్కడితో ఆగకుండా తెలివిగా కాజేసిన సొమ్ము రూ.12 కోట్లను వెంటనే వేరు వేరు బ్యాంకుల్లోని 100 అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు.
తమ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయిందని తెలుసుకున్న మహేశ్ బ్యాంక్ యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. సుమారు రూ.12 కోట్లు మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: