హైదరాబాద్ మణికొండలో విల్లాలు వరదలో చిక్కుకున్నాయి. అధికారులు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రైల్స్ విల్లాలను అంబియన్స్ ప్రాపర్టీస్ వారు నిర్మించారు. ఇందులో ఒక్కొక్క విల్లా ధర రూ.6 కోట్లుగా ఉంది. మొన్నటి వరకు అత్యంత ఖరీదైన విల్లాలుగా పేరుగాంచిన ఆ ప్రాంతం ఇప్పుడు వరదనీటితో నిండిపోయింది.
నడుములోతు నీళ్లలో విల్లాల వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పడవుల ద్వారా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 రోజులుగా ఈ పరిస్థితి నెలకొందని విల్లావాసులు తెలిపారు. కార్లు, ఖరీదైన ఇంటి సామాగ్రి నీళ్లలో తడిచి పనికి రాకుండా పోయాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి:బతుకమ్మ కోసమే విరబూస్తున్నట్లుగా... కట్టిపడేస్తున్నాయ్