ETV Bharat / state

Telugu Akademi Scam: తెలుగు అకాడమీ కేసులో పోలీస్ కస్టడీకి ఆరుగురు నిందితులు - Six accused in Telugu Academy case

Telugu Akademi Scam: తెలుగు అకాడమీ డిపాజిట్ల కుంభకోణం కేసులో ఆరుగురిని నిందితులను నేటి నుంచి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు. ఆరుగురు నిందితులను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది.

Telugu Academy Scam
Telugu Academy Scam
author img

By

Published : Dec 2, 2021, 9:51 PM IST

Updated : Dec 3, 2021, 3:58 AM IST

Telugu Akademi Scam: తెలుగు అకాడమీ డిపాజిట్ల కుంభకోణం కేసులో ఆరుగురిని నిందితులను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 10రోజుల కస్టడీ కోరగా... కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. ప్రధాన నిందితుడు సాయి కుమార్, వెంకటరమణ, సోమశేఖర్, వెంకట్, ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, తెలుగు అకాడమీ పర్యవేక్షకుడు రమేశ్​ను చంచల్​గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

Telugu Akademi Scam: నేటి నుంచి రెండు రోజుల పాటు నిందితులను ప్రశ్నించి సమాచారం రాబట్టేందుకు సీసీఎస్ పోలీసులు ప్రయత్నించనున్నారు. తెలుగు అకాడమీకి చెందిన దాదాపు రూ. 63కోట్ల డిపాజిట్లను నిందితులు బ్యాంకుల నుంచి కొల్లగొట్టారు. నకిలీ పత్రాలు సృష్టించి యూనియన్, కెనరా బ్యాంకులో ఉన్న డిపాజిట్లను ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాలోకి మళ్లించారు. ఆ తర్వాత నగదును విడతల వారీగా విత్ డ్రా చేసుకొని వాటాలు పంచుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే సీసీఎస్ పోలీసులు నిందితులకు సంబంధించిన ఆస్తులను జప్తు చేశారు.

రూ.63 కోట్లకు సంబంధించిన లెక్క తేలకపోవడం వల్ల నిందితులను మరోసారి ప్రశ్నించేందుకు సీసీఎస్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు మొత్తం 23 మందిని అరెస్ట్ చేశారు. నిందితులందరూ చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

డబ్బును.. పప్పు, బెల్లాల్లా పంచుకున్నారు..

Telugu Akademi deposits case: బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన తెలుగు అకాడమీ డిపాజిట్లను దొంగదారిన విత్ డ్రా చేసుకున్న నిందితులు ఆ డబ్బును పప్పు, బెల్లాల్లా పంచుకున్నారు. యూబీఐ కార్వాన్, సంతోష్ నగర్ ఖాతాల్లో రూ.54.5 కోట్లు.. చందానగర్​లోని కెనరా బ్యాంకులో ఉన్న రూ.10 కోట్లను కొల్లగొట్టిన ముఠా సభ్యులు మొత్తం రూ.64.5 కోట్లు వాటాలుగా పంచుకున్నారు. ఇందులో అధిక వాటా తీసుకున్న వెంకటసాయి కుమార్ హైదరాబాద్ బాహ్యవలయ రహదారికి పక్కన 35 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. దుబాయి నుంచి తక్కువ ధరకు డీజిల్ వచ్చేలా ఏజెన్సీ ఇప్పిస్తానంటే ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇచ్చి మోసపోయినట్లు సీసీఎస్ పోలీసులకు తెలిపారు.

యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీకి వచ్చిన రూ.2.5 కోట్ల డబ్బులతో ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన కూడా 2 కోట్ల రూపాయలు తీసుకొని ఫ్లాట్లు కొనుగోలు చేసింది. కొంత నగదు ఉందని దాన్ని వెనక్కి తిరిగిచ్చేస్తామని పోలీసులకు తెలిపారు. మరో నిందితుడు వెంకటేశ్వర్ రావు రూ.3 కోట్లు తీసుకొని సత్తుపల్లిలో బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ శాఖల్లోని డబ్బులను డిపాజిట్ల పేరుతో కొల్లగొట్టేందుకు కృష్ణారెడ్డి, సాయికుమార్ కలిసి ముఠా ఏర్పాటు చేసి కథ నడిపించినట్లు పోలీసులు తేల్చారు.

ఇదీ చూడండి: cm kcr met farmers: వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్​... ఆశ్చర్యపోయిన రైతులు.. ఆ తర్వాత..

Last Updated : Dec 3, 2021, 3:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.