ETV Bharat / state

TSPSC పేపర్ లీకేజీ కేసు.. నిందితుల ద్వారా ఇంకెవరికైనా ప్రశ్నాపత్రం వెళ్లిందా..!

TSPSC Paper Leak Case Latest Updates: టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే చంచల్‌గూడ జైలులో ఉన్న షమీమ్‌, రమేశ్‌, సురేశ్‌ను కస్టడీలోకి తీసుకుంది. ఇందులో భాగంగానే ముగ్గురు నిందితులను.. ఐదు రోజుల పాటు సిట్‌ అధికారులు విచారించనున్నారు.

TSPSC paper leak case
TSPSC paper leak case
author img

By

Published : Mar 29, 2023, 3:38 PM IST

TSPSC Paper Leak Case Latest Updates: రాష్ట్రంలో టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిట్ అధికారులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. నాంపల్లి కోర్టు అనుమతితో షమీమ్, రమేష్, సురేష్​లను సిట్ అధికారులు చంచల్​గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత.. హిమాయత్​నగర్​లోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. గ్రూప్- 1 ప్రిలిమ్స్​లో షమీమ్​కు 126 మార్కులు, రమేష్​కు 122, సురేష్​కు 100కు పైగా మార్కులొచ్చాయి.

నిందితుల ద్వారా ఇంకెవరికైనా ప్రశ్నాపత్రం వెళ్లిందా: రాజశేఖర్​ రెడ్డి , ప్రవీణ్​ల ద్వారా ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని ముగ్గురు నిందితులు తీసుకున్నట్లు సిట్ అధికారులు ఇప్పటికే తేల్చారు. వీరి ద్వారా ఇంకెవరికైనా ప్రశ్నాపత్రం వెళ్లిందా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ముగ్గురిని వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు వీరిని సిట్ అధికారులు ప్రశ్నిస్తారు. గ్రూప్​-1 ప్రిలిమ్స్​లో 100కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు సిట్ కార్యాలయానికి వస్తున్నారు.

గత వారం రోజుల నుంచి సిట్ అధికారులు 100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులను పిలిచి వివరాలు సేకరిస్తున్నారు. 18 అంశాలతో కూడిన పత్రాన్ని ఇచ్చి దాన్ని నింపి ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు సూచిస్తున్నారు. ఆ మేరకు వారు పత్రాలను నింపి సిట్ అధికారులకు ఇచ్చి వెళ్తున్నారు. గతంలో ఎన్నిసార్లు టీఎస్​పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు.. వెళితే ఎవరెవరిని కలిశారు.. ఎక్కడ శిక్షణ తీసుకున్నారు.. చిరునామా, కుటుంబ వివరాలను అభ్యర్థుల నుంచి తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100పైగా మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల్లో.. 60మందిని విచారించారు. రాజశేఖర్‌ రెడ్డి బావ ప్రశాంత్‌ న్యూజిలాండ్​లో ఉండటంతో సిట్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ జిల్లా సల్కర్‌పేటలో తిరుపతయ్య ఇంటికి వెళ్లిన పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. అతని కుటుంబసభ్యులను ప్రశ్నించారు. గండీడ్‌ ఎంపీడీవో కార్యాలయంలో వివరాలు సేకరించారు.

ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకం పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. డాక్యానాయక్‌తో అతడికి పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే డాక్యానాయక్ తన వద్ద ఏఈ ప్రశ్నపత్రం ఉందని.. తిరుపతయ్యకు తెలిపాడు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ఫరూక్‌నగర్ మండలం నేరెళ్లపల్లికి చెందిన రాజేందర్ కుమార్‌తో రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని.. రూ.5లక్షలు తీసుకొని ప్రశ్నపత్రం చేతికిచ్చేందుకు తిరుపతయ్య దళారిగా వ్యవహరించినట్లు నిర్ధారణ కావడంతో అతన్ని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి: హార్టికల్చర్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటన

రేవంత్​రెడ్డి, బండి సంజయ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం.. లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. మోదీ కుటిల నీతికి నిదర్శనం : రేవంత్​ రెడ్డి

దారి చూపిన ఫైజల్.. రాహుల్​కు లైన్ క్లియర్!.. అనర్హత వేటు వెనక్కే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.