SIT Officials Investigated Advocate Srinivas: దర్యాప్తు పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారని న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని సిట్ అధికారులు చెప్పారని తద్వారా ఇతర పనులు ఏం చేసుకోలేకపోతున్నట్లు శ్రీనివాస్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దర్యాప్తుతో సంబంధంలేని విషయాలు అడుగుతున్నారని ఐటీ చెల్లింపునకు చెందిన వివరాలు తేవాలని అడుగుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రశ్నిస్తుండటం వల్ల.. తాను ఒత్తిడికి గురవుతున్నాడని శ్రీనివాస్ న్యాయస్థానానికి వివరించారు.
అయితే దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రెండురోజులు సిట్ అధికారులు ప్రశ్నించారని పురోగతిని బట్టి మరోసారి ప్రశ్నించాల్సి ఉన్నందున.. పిలిచినప్పుడు రావాలని సిట్ అధికారులు శ్రీనివాస్‌కి చెప్పినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. హైకోర్టుకి తెలిపారు. శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈనెల 25న సిట్ ఎదుట హాజరై అధికారులు అడిగిన సమాచారాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది.
ఇవీ చదవండి: