ETV Bharat / state

SIT Inquiry in MLAs bribing case : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రెండో రోజు నిందితుల పోలీసు కస్టడీ - ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

SIT Inquiry in MLAs bribing case : ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులను రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. చంచల్‌గూడ జైళ్లో ఉన్న నలుగురు నిందితులను తొలిరోజు రాజేంద్రనగర్‌ ఠాణాలో విచారించిన పోలీసులు.... ఇవాళ నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం ల్యాబ్‌లో నిందితుల వాయిస్‌ రికార్డు చేయనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బు ఎక్కడిదని ఆరా తీస్తున్న సిట్‌ రామచంద్రభారతి వాంగ్మూలమే ఈ కేసులో కీలకం కానుందని భావిస్తోంది.

SIT Inquiry in MLAs bribing case
SIT Inquiry in MLAs bribing case
author img

By

Published : Nov 11, 2022, 10:24 AM IST

SIT Inquiry in MLAs bribing case : రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన 'తెరాస ఎమ్మెల్యేలకు ఎర' కేసులో సిట్‌ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. నిన్నంతా రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో నలుగురు నిందితులను సిట్‌ విచారించగా... సాయంత్రం వారిని తిరిగి చంచల్‌గూడకు జైలుకు తరలించారు. రెండో రోజు విచారణ కోసం చంచల్‌గూడ జైలులో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.... ప్రత్యేక వాహనంలో బందోబస్తు మధ్య ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. నాంపల్లిలోని F.S.L.కు తరలిచిన పోలీసులు.... అక్కడ నిందితుల వాయిస్‌ రికార్డు చేయనున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడ్డ ఆడియో, వీడియోల్లోని వాయిస్‌తో తాజాగా రికార్డు చేసిన వాటిని పోల్చిచూడనున్నారు. ఈ కేసులో ఎఫ్‌ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది

ఈ వ్యవహారంలో నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతి వాంగ్మూలం కీలకం అవుతుందని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. దిల్లీ నుంచి వచ్చిన ఆయనే ఎమ్మెల్యేలతో డబ్బుల గురించి మాట్లాడటం, పైలట్‌ రోహిత్‌రెడ్డికి 100 కోట్లు.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు 50 కోట్ల చొప్పున ఇప్పిస్తాననడంతో... ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ విషయంలో ఆయనను ప్రశ్నించడంపై సిట్‌ దృష్టి సారించింది.

ఎమ్మెల్యేలతో ఫాంహౌస్‌లో బేరసారాల సందర్భంగా నిందితులు చెప్పిన విషయాలపై ప్రశ్నించగా.. చాలావరకు తమకు తెలియదనే సమాధానమే వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలతో నిందితులు జరిపిన సంభాషణలపై సిట్‌ ఆరా తీస్తోంది. నిందితుల సెల్‌ఫోన్లను ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. నివేదిక అందాక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.