ETV Bharat / state

ఏపీ: బలరాంపురంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను గుర్తింపు - paidithalli ammavari sirimanu latest news

ఆంధ్రప్రదేశ్​ విజయనగరంలో ఘనంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కోసం.. సిరిమాను చెట్టును గుర్తించారు. ఈ పవిత్ర వృక్షానికి భక్తులు పూజలు నిర్వహించారు.

sirimanu-tree-identified-for-paidithalli-sirimanotsav-at-balaram-puram-in-vijayanagaram-district
ఏపీ: బలరాంపురంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను గుర్తింపు
author img

By

Published : Oct 7, 2020, 7:15 PM IST

ఏపీ విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరలో భాగంగా ప్రధాన ఘట్టమైన సిరిమాను చెట్టును గుర్తించి, చెట్టువద్ద ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సిరిమాను అధిరోహించే పూజారికి అమ్మవారు స్వప్నంలో రావటం వల్ల ఏటా పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఏపీ: బలరాంపురంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను గుర్తింపు

ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా జామి మండలం బలరాంపురంలో సిరిమాను చెట్టుని గుర్తించి, పూజారులు చెట్టుకు బొట్టు పెట్టి విశేష పూజలు జరిపారు. అనంతరం జిల్లా కేంద్రానికి తరిలించేందుకు ఈనెల 12వ తేదీన ముహూర్తం ఖరారు చేసినట్లు ఆలయ పూజారి వివరించారు.

అమ్మవారు స్వప్నంలో కనిపించి... బలరాంపురంలో పెంటం చిన్నంనాయుడు, తమ్మినాయుడు, అప్పలనాయుడు కల్లాల్లో ఉన్న సిరిమాను చెట్టు కావాలని కోరారు. ఈనెల 12న 9 గంటల 15 నిమిషాలకు చెట్టును నరికి.. జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. - బంటుపల్లి వెంకటరావు, ఆలయ పూజారి

ఇదీ చదవండి: రాళ్లు రప్పల మార్గంలో శ్రీవారి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.