Singireddy Niranjan Reddy America Tour Updates : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా మూడో రోజు వాషింగ్టన్ డీసీలోని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్- ఎన్‌ఐఎఫ్‌ఏను సందర్శించారు. ఆ సంస్థ డైరెక్టర్ మంజిత్ మిశ్రాతో మంత్రి భేటీ అయ్యారు. ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మ్యానేజ్మెంట్, మార్కెటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్.. తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై యూఎస్‌డీఏ ప్రతినిధులతో మంత్రి బృందం విస్తృతంగా చర్చించింది.
Singireddy Niranjan Reddy America Tour 3rd Day : అమెరికాలో వ్యవసాయం మెరుగుపరిచే పరిశోధనలు చేయడం, సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహించడం, కావాల్సిన నిధులు సమకూర్చడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, పర్యావరణ సమతుల్యత పాటించేలా చూడడం ఎన్‌ఐఎఫ్‌ఏ(NIFA) ప్రధాన లక్ష్యాలు. పరిశోధన రంగంలో యూఎస్‌డీఏ సహకారం ఆశిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికత అందిపుచ్చుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు.
Singireddy Niranjan Reddy America Tour Speech : ఉపాధి కల్పనలో వ్యవసాయం అనుబంధ రంగాల పాత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసని.. అందుకే వ్యవసాయ అనుకూల విధానాలకు పెద్దపీట వేసి రైతులను ప్రోత్సహిస్తున్నారని ప్రస్తావించారు. సమైక్య పాలనలోని సంక్షోభంలో ఉన్న వ్యవసాయం.. రాష్ట్రంలో సంబరంగా మారిందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్నారని వివరించారు. తెలంగాణలో నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నాయని, సాగు విస్తీర్ణం పెరిగిందని, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నందున వలసలు ఆగిపోయాయని పేర్కొన్నారు. వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి గ్రామాలకు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
NIFI Director Manzil Speech about Telangana : ప్రధాన ఆహార పంట వరి ఉత్పత్తిలో రాష్ట్రం పంజాబ్‌ని మించిపోయిందని అన్నారు. భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ పంటలు పండించడానికి అనువుగా ఉన్నాయని వివరించారు. దేశంలో లభిస్తున్న వనరులతో 140 కోట్ల జనాభాకు ఆహారం అందించగలమని.. విదేశాలకు కూడా ఎగుమతి చేసే సామర్థ్యం ఉందని చెప్పారు. నాణ్యతతో కూడిన పౌష్టికాహారం భావిపౌరులకు అందించాలని అన్నారు. ఏ దేశంలోనైనా వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యమని ఎన్‌ఐఎఫ్‌ఏ డైరెక్టర్ మంజిల్ మిశ్రా(Manzil Misra) అన్నారు. కానీ, ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు అని.. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఆర్గనైజేషన్‌లో ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ని కలిశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: నిరంజన్ రెడ్డి
'ఆధునిక పద్ధతిలో వ్యవసాయానికి రైతు వేదికల నిర్మాణం'
niranjan reddy: 'అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది.?'