సింగరేణి చరిత్రలోనే ఈ ఏడాదిలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు ఎండీ శ్రీధర్ దిశానిర్ధేశం చేశారు. ప్రతిరోజూ, ప్రతి నెలా నిర్దేశించుకున్న లక్ష్యాలను క్రమం తప్పకుండా సాధిస్తూ ముందుకు పోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, 11 ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనా వల్ల గతేడాది బొగ్గు ఉత్పత్తి, రవాణాలో వెనుకబడిపోయామన్నారు. ప్రస్తుతం కొత్త గనులు ప్రారంభమవడం, కాంట్రాక్టులు ఖరారు కావడం, బొగ్గుకి డిమాండ్ పెరగడం వంటి పూర్తి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
కొత్త గనులకు సంబంధించి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలపై తాను స్వయంగా 5 జిల్లాల కలెక్టర్లతో మాట్లాడానన్నారు. కలెక్టర్లు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఏరియా జీఎంలు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
ఇదీ చూడండి: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా