ETV Bharat / state

కరోనా పరీక్షలపై.. సింగరేణి సీఎండీ వీడియో కాన్ఫరెన్స్​ - సింగరేణి బొగ్గు ఉత్పత్తి సంస్థ

సింగరేణి ఏరియాల్లో ప్రతిరోజూ కొవిడ్‌ పరిస్థితిని సమీక్షించడమే గాక.. రోజువారి కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ సింగరేణి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​లోని సింగరేణి భవన్‌ నుంచి ఆయన సింగరేణి డైరెక్టర్లు, జీఎంలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

Singaareni CMD Video Conference
కరోనా పరీక్షలపై..సింగరేణి సీఎండీ వీడియో కాన్ఫరెన్స్​
author img

By

Published : Aug 17, 2020, 10:50 PM IST

హైదరాబాద్​లోని సింగరేణి భవన్​ నుంచి సింగరేణి సీఎండీ శ్రీధర్​ అన్ని ఏరియాల డైరెక్టర్లు, జీఎంలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్​ నివారణకు సింగరేణిలో తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల నుంచి బొగ్గు వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలకు ర్యాపిడ్​ టెస్టింగ్​ కిట్లు పంపిణీ చేశామని, రోజుకు సాధ్యమైనన్ని ఎక్కువ టెస్టులు నిర్వహించాలని, బాధితుడి పరిస్థితిని బట్టి.. స్థానిక క్వారంటైన్​, ఏరియా ఆస్పత్రులలోని కరోనా వార్డుకు తరలించాలని సూచించారు. సింగరేణి కార్మికులకు కాపాడుకునే బాధ్యత సింగరేణి యాజమాన్యందే అని, ఖర్చుకు వెనుకాడకుండా సింగరేణి కార్మికులకు వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.

ప్రతిరోజు ఏరియా స్థాయిలో కొవిడ్‌ పరిస్థితులపై సంబంధిత వైద్యశాఖ అధికారులతో ఏరియా జీఎంలు సమీక్షలు జరపాలని, కావాల్సిన మందులు, సౌకర్యాల కోసం వెంటనే అనుమతులు పొందాలని సూచించారు. పాజిటివ్​ కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటి నుండే సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. సింగరేణి ఏరియాల వారిగా బొగ్గు ఉత్పత్తి, రవాణాపై ఆరా తీశారు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి కూడా తగ్గినందున బొగ్గు వినియోగం బాగా పడిపోయిందని, సెప్టెంబర్‌ నుండి మళ్లీ రాష్ట్రంలోనూ, దేశంలోనూ యధాతథ స్థితి నెలకొనే అవకాశం ఉంది కావున.. బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాల్సి వస్తుందని ఆయన అన్నారు. కొత్త గనుల ప్రారంభం, ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చూడండి : 'మెడికల్ హబ్​గా హైదరాబాద్​ మహానగరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.