విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్రావు కుమారుడు వశిష్టపై ఆయన భార్య సింధూశర్మ బంధువులు దాడి చేశారు. భరోసా కేంద్రం వద్ద కౌన్సిలింగ్ ముగిసిన తరువాత పెద్ద కూతురు రిషికను ఇంటికి తీసుకెళ్తుండగా అతని కారును అడ్డగించారు. పోలీస్ కంట్రోల్ రూం వరకు ఓ వ్యక్తి కారు పైనే ఎక్కి వశిష్టపై దాడికి యత్నించారు. పోలీసులు వెంబడించడం వల్ల ఆ వ్యక్తి కారు నుంచి దూకి మెట్రో బస్సులో పారిపోయాడు.
ఇదీ చదవండి : విశ్రాంత న్యాయమూర్తి కుమారునిపై వరకట్న వేధింపుల కేసు