ETV Bharat / state

ఆ పనులతో.. సింహాచలం చిన్నబోతోందా..? - simhachalam laxmi narasimha swamy news

సముద్ర తీరానికి కోసెడు దూరంలో.. సువిశాల విశాఖ నగరానికి చేరువలో.. కనువిందు చేసే తూర్పు కనుమల గిరిలో కొలువై ఉన్నాడు ఆ నరహరి నారాయణుడు. సింహ రూపంలో ఉన్న కొండపై కొలువైన ఆ నరసింహ స్వామి సింహాచలేశుడిగా ప్రసిద్ధి చెందాడు. భక్తులకు ఆధ్యాత్మికంగా, పర్యటకంగా సేదతీర్చే ఆంధ్రప్రదేశ్​ విశాఖపట్టణంలోని సింహాచలం.. రూపు మారుతుందా అంటే అవుననే అంటున్నారు భక్తులు. అభివృద్ధి పేరిట ఏపీ ట్రాన్స్​కో చేపట్టిన పనులు కారణంగా కొండ అందాలు కనుమరుగవుతున్నాయంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

simhachalam-sri-laxmi-narasimha-swamy-visakhapatnam-district
ఆ పనులతో.. సింహాచలం చిన్నబోతోందా..?
author img

By

Published : May 28, 2020, 1:00 PM IST

అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యటకంగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్​ విశాఖపట్టణంలోని సింహాచల వరాహ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం రూపు మారుతుందా.. అంటే అవుననే అంటున్నారు స్థానికులు. కొండ సమీపంలో చేప్పట్టిన ఏపీ ట్రాన్స్ కో ట్రాన్స్ మిషన్ నిర్మాణం భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. స్వామి తొలిమెట్టు మార్గం మీద నుంచి ఈ మహా విద్యుత్ ప్రవాహ గమనం ఉండే విధంగా టవర్ నిర్మాణం చేయడం భక్తులకు ఇబ్బంది కరంగా మారింది. ఎపీ ట్రాన్స్ కో... అప్ గ్రేడ్​లో భాగంగా 120 కిలోవాట్ నుంచి 220 కిలోవాట్ సామర్ధ్యం పెంచే విద్యుత్ లైన్ పనులు ప్రారంభించారు.

రూ. పదిహేడు కోట్ల ఖర్చుతో సింహాచల కొండ భాగంలో ఇరవై హై పవర్ ట్రాన్స్ మిషన్ టవర్ నిర్మాణం చేపట్టారు. వీటిలో ప్రధానంగా తొలిమెట్టు నుంచి చూస్తే స్వామి ఆలయ ఆకృతులు దర్శనమిస్తాయి. అలాంటి ఆకృతులు కనిపించకుండా ఈ టవర్ అడ్డుగా కనిపిస్తోందని స్థానికులు భావిస్తున్నారు. విద్యుత్ లైన్ నిర్మాణం వల్ల సింహాచల కొండల అందానికి, ప్రకృతి సమతుల్యత విఘాతం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశం శారద పీఠాధిపతి స్వరూపనదేంద్ర సరస్వతి దృష్టికి వెళ్లడం దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు విషయాన్ని తెలియజేశారు. భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలిగే చర్యలు మరోసారి సమీక్షించుకోవాలని కోరగా.. మంత్రి వేలంపల్లి, సింహాచల దేవస్థాన ఈవోను పనులు ఆపాల్సిందిగా ఆదేశించారు. దీంతో టవర్ నిర్మాణ పనులు కొంత మేర నిలిపివేేశారు. అయితే పవిత్ర ఆలయం సమీపంలో అందులోనూ వేలాది భక్తులు వచ్చే మార్గంలో ఇలాంటి విద్యుత్​ లైన్ నిర్మాణం అందోళన కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు.

ఇవీ చూడండి: రోడ్డుప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.