దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లల ఆకలి తీరుస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు బాచుపల్లిలోని సిల్వర్ ఓక్స్ విద్యా సంస్థల అధినేత వి.ధనుంజయ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఆ ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస్‌కు ధనుంజయ మాతృమూర్తి బసవ పునమ్మ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
భూరి విరాళం అందజేసిన దాతకు చంద్రదాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తంతో ఏడాది పాటు 9 వేల మంది విద్యార్థుల ఆకలి తీర్చొచ్చని చెప్పారు. పేద విద్యార్థులకు సాయం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని... ఆ కల నేటితో తీరిందని వి.ధనుంజయ అన్నారు. తమ పాఠశాలలో చదువుతున్న 4,500 మంది విద్యార్థులు కూడా దీన్ని చూసి స్ఫూర్తి పొందుతారని ఆశాభావం వ్యక్తంచేశారు.
2000లో ప్రారంభమైన అక్షయ పాత్ర ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 18 లక్షల మంది పిల్లల ఆకలిని తీరుస్తోంది. మొత్తం 12 రాష్ట్రాల, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సేవలను అందిస్తోంది.
ఇదీ చూడండి: నీటిపై తేలియాడుతూ 'గురూజీ' యోగా విన్యాసాలు