రాష్ట్రంలో డిసెంబర్ నెలలో 71 శాతం టీఎంసీల భూగర్భ జలాలను వినియోగించారు. తెలంగాణ భూగర్భజలాల స్థితిగతులకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక వివరాలు వెల్లడించింది. 2020 మే నెలతో పోలిస్తే డిసెంబర్ వరకు భూగర్భ జలాలు దాదాపు 596 టీఎంసీలు పెరిగినట్లు అంచనా వేశారు. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు చూస్తే 71 టీఎంసీల మేర తగ్గినట్లు గుర్తించారు.
రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాల వల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. 2019 డిసెంబర్‌తో పోలిస్తే 2020 డిసెంబర్‌కు ఈ పెరుగుదల 2.46 మీటర్లుగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏకంగా 49 శాతం భూభాగంలో భూగర్భజలాలు కేవలం ఐదు మీటర్లలోపే ఉన్నాయి. 20 మీటర్లకు పైగా లోతున కేవలం ఒకశాతం భూభాగంలో మాత్రమే జలమట్టం ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో గత 2019 డిసెంబర్‌తో పోలిస్తే 2020 డిసెంబర్ నాటికి భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. పదిమీటర్ల కంటే తక్కువ లోతులో జలమట్టం ఉండే ప్రాంతం ఏకంగా 4,957 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఎక్కువ లోతులో భూగర్భజలాలు ఉండే ప్రాంతం ఏకంగా 19 శాతానికి తగ్గింది.
ఇవీ చదవండి : 'వ్యాక్సినేషన్ విజయవంతం... సీఎం కృషి అభినందనీయం'