హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ స్వర్ణదేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్కాన్ పూజారులు శాలువా కప్పి, స్వామివారి చిత్రపటాన్ని హరీశ్‌రావుకు అందజేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన ఉజ్వలసేవలో హరీశ్‌రావు, కేశవరావు పాల్గొని మాధవున్ని సేవించారు. ఆలయం ప్రాంగణమంతా గోవిందనామంతో మారుమోగింది.
ఇదీ చూడండి :కృష్ణాష్టమి: సూపర్ స్టార్స్ ఉట్టి కొడితే...!