Hyderabad SI Rajendra Drugs Case Update : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు(Drug Case)లో అరెస్ట్ అయిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్సై రాజేంద్ర(SI Rajendra)ను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కూకట్పల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. పోలీసులు వారం రోజులు అడగగా రెండు రోజులు కస్టడీకి అనుమతి ఇచ్చింది. మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్న ఎస్సై రాజేంద్రను రాయదుర్గం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 1700 గ్రాముల మాదకద్రవ్యాలు విక్రయించేందుకు ప్రయత్నించిన విషయాలను.. పోలీసులు నిందితుడి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించేందుకు ఎవరెవరిని సంప్రదించారనే వివరాలను సేకరిస్తున్నారు. ఎస్సైని ప్రశ్నిస్తున్న పోలీసులు అతని నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
Kukatpally Court judgment on SI Rajendra Drugs Case : ఎస్సై రాజేంద్రను ప్రశ్నించేందుకు కూకట్పల్లి కోర్టుకు 2రోజుల కస్టడీకి అనుమతించింది. వారం రోజుల కస్టడీ కావాలని పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎస్సై రాజేంద్ర నైజీరియన్ నుంచి స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను తన ఇంట్లో దాచిపెట్టుకున్నట్లు గుర్తించామని.. విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేసినట్లు పీపీ కోర్టుకు తెలిపారు. ముంబయిలో నిందితుడి నుంచి తీసుకున్న డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు ఎలా తీసుకొచ్చాడు.. ఎవరికి విక్రయించేందుకు ప్రయత్నించాడనే విషయాలను తెలుసుకోవాల్సి ఉందని.. దీనికోసం వారం రోజుల కస్టడీ ఇవ్వాలని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న కూకట్పల్లి కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించింది. సోమవారం రాజేంద్రను రాయదుర్గం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ ముగిసిన తర్వాత పోలీసులు రాజేంద్రను కోర్టులో హాజరుపర్చనున్నారు.
Hyderabad SI Rajendra Drugs Case Update : డ్రగ్స్ కేసు అప్డేట్.. SI రాజేంద్ర కాల్‌డేటాలో అసలుగుట్టు
SI Rajendra Drugs Case Full Details : నైజీరియాకు చెందిన ఒకెరొకో ఇకేబీ ముంబయిలో ఉంటూ మాదకద్రవ్యాల విక్రయాలు(Drug Sales), సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. నైజీరియా నుంచి మేకె బెంజైన్ పేరుతో మరో నకిలీ వీసా చేసుకున్నాడు. ముంబయిని అడ్డాగా చేసుకుని.. కోట్లల్లో సింథటిక్ డ్రగ్స్ దందా ప్రారంభించాడు. ఇకేబీని అరెస్టు చేసేందుకు ముంబయి, సైబరాబాద్ పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం ప్రయత్నించారు. దీంతో ఇద్దరు నిందితులు పారిపోగా.. ఇకేబీని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో 5 కిలోల మెథకొలిన్‌లో 3 కిలోలు ముంబయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 2 కిలోల సంచి ఎస్సై రాజేంద్ర తీసుకున్నాడు. రిమాండ్ రిపోర్టులో మాత్రం 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాడు. సదరు ఎస్సై అరెస్టయినప్పుడు 1,750 గ్రాముల మాదకద్రవ్యాలను రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎస్సై రాజేంద్రతో పాటు దర్యాప్తు నిమిత్తం మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ముంబయికి వెళ్లారు.
Hyderabad Sub Inspector Drugs Case Update : ఖాకీ వనంలో డ్రగ్స్.. ఆ ముగ్గురిపై కూడా పోలీసుల ఫోకస్