తెరాస సభ్యత్వ నమోదులో ముషీరాబాద్ నియోజకవర్గం అగ్రభాగాన నిలవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లక్ష్య సాధనకు కార్యకర్తలు, నాయకులు నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్‌లోని వైశ్య విద్యార్థి వసతి గృహంలో పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కేవలం నాలుగు సీట్లే గెలిచి ప్రగల్భాలు పలుకుతోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసనసభ్యుడు ముఠా గోపాల్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : చంద్రయాన్-1కు కొనసాగింపే కానీ... ప్రత్యేకం