హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి ప్రాంగణంలో జన్యుపరంగా అరుదుగా వచ్చే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు. సమస్యను ముందస్తుగానే గుర్తిస్తే తీవ్రతరం కాకుండా చూసుకునే అవకాశం ఉందని సూచించారు. కామినేని ఆస్పత్రి జెనెటిక్ సమస్యలను పరిష్కరించే దిశగా ఆధునిక వైద్య విధానంతో ముందుందని డాక్టర్ పల్లవి తెలిపారు.
ఖమ్మం జిల్లా భద్రాచలంలో జెనెటిక్ సమస్యతో ఓ శిశువు 1.5 కేజీల బరువుతో జన్మించింది. ఏడాది తర్వాత ఆరోగ్య సమస్య తీవ్రతరం అయిందని చిన్నారి తల్లిదండ్రులు వెల్లడించారు. ఆ సమయంలోనే కామినేని వైద్యులని సంప్రదించామని, చిన్నారి సమస్యను వైద్యులు పరిష్కరించారని వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :వీరుడికి ఘనస్వాగతం