ETV Bharat / state

భారీ ప్రాజెక్టులేవి... భాగ్యనగర వాసికి తప్పని నిరాశ! - బడ్జెట్​ 2021

బడ్జెట్‌లో పేదవర్గాలకు అనుకున్నంత మేలు జరగలేదు. మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గలేదు. వేతన జీవులకూ ఊరటనివ్వలేదు. కరోనా మహమ్మారి సృష్టించిన కష్టాల నుంచి క్రమంగా కోలుకుంటున్న సమయంలో బడ్జెట్‌ గుదిబండ మరింత భారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

నగర వాసికి తప్పని నిరాశ... ప్రస్తావన లేని భారీ ప్రాజెక్టులు

author img

By

Published : Feb 2, 2021, 7:13 AM IST

పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.100 కాగానే.. బైక్‌ పక్కన ఆపి.. శిరస్త్రాణం తీసి.. పైకి చూపండీ.. క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ సెంచరీ చేయగానే ఇదే చేస్తాడు. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న జోక్‌. ప్రస్తుతం పెరుగుతోన్న ఇంధన ధరలు దీన్ని నిజం చేస్తాయనే అభిప్రాయాన్ని మరింత బలపడేలా చేసింది. బడ్జెట్‌లో పేదవర్గాలకు అనుకున్నంత మేలు జరగలేదు. మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గలేదు. వేతన జీవులకూ ఊరటనివ్వలేదు. కరోనా మహమ్మారి సృష్టించిన కష్టాల నుంచి క్రమంగా కోలుకుంటున్న సమయంలో బడ్జెట్‌ గుదిబండ మరింత భారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

నగరానికి ఎలక్ట్రిక్‌ బస్సులు

నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకు ప్రజారవాణా పెరుగుదలతోనే పట్టణాల్లో కాలుష్యానికి చెక్‌ పెట్టాలని భావించింది. అందుకే ఈసారి కేంద్ర బడ్జెట్‌లో వాయు కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేసింది. ఏకంగా రూ. 2,270 కోట్లను కేటాయించింది. ప్రజారవాణా పెరుగుదలలో ఏకంగా 20వేల ఎలక్ట్రిక్‌ బస్సులను సమకూర్చడానికి సిద్ధమౌతున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ బస్సులలో నగరం వాటా ఎంత ఉంటుందనేది తేలాల్సిఉంది.

హైస్పీడ్‌ రైళ్లు మరిచారు

బడ్జెట్‌లో భాగ్యనగరానికి సంబంధించి కొత్త రైళ్ల ప్రకటన లేదు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, ముంబయి, విజయవాడ, విశాఖపట్నం తదితర అత్యంత రద్దీ ఉండే మార్గాల్లో హైస్పీడ్‌ రైళ్ల ఊసే లేకుండా పోయింది. చర్లపల్లి టర్మినల్‌, నాగులపల్లి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి కూడా అగమ్యగోచరమే. రైల్వే కేటాయింపులకు సంబంధించి పింక్‌ బుక్‌లో పేర్కొంటారు. మంగళవారం ఆ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అత్యంత రద్దీతో పాటు.. వినియోగం ఉన్న మార్గాల్లో భద్రత కోసం ‘యాంటీ కొలిజన్‌ సిస్టమ్‌’ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

15 లక్షల వాహనాలు.. తుక్కు తుక్కు!

బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన వాహనాల తుక్కు వాహనాల చట్టంతో గ్రేటర్‌ వ్యాప్తంగా దాదాపు 15-20 లక్షల వాహనాలు తుక్కు కింద మారనున్నాయని రవాణా శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌ రద్దీ తగ్గడంతోపాటు పర్యావరణానికి పెద్ద ఊరట లభించనుందని భావిస్తున్నారు. నగరంలో 55 లక్షల నుంచి 60 లక్షల వాహనాలు తిరుగుతుండగా ఇందులో 15 లక్షల వాహనాలకుపైగా 15-20 ఏళ్లు గడిచిపోయినట్లు తెలుస్తోంది. కొత్త చట్టంతో ఇలాంటి వాహనాలు ఇక నుంచి రోడ్లపైకి రాకుండా అడ్డుకట్ట పడుతుంది.

కొత్త ఎస్టీపీలకు భరోసా

తాజా బడ్జెట్‌లో నగరాల్లో మురుగు శుద్ధికి ప్రాధాన్యం దక్కడంతో వాయిదా పడిన ఎస్టీపీలకు మోక్షం లభించనుందని జలమండలి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో తాగునీటి సరఫరా అవుటర్‌ రింగ్‌రోడ్డు వరకు పెరిగి మురుగు ఉత్పత్తి రెండింతలకు చేరుకుంది. గ్రేటర్‌ వ్యాప్తంగా నిత్యం 1,800 మిలియన్‌ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 40 శాతమే శుద్ధి చేస్తున్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా కొత్తగా 65 ఎస్టీపీలను నిర్మించాలని జలమండలి ప్రణాళిక సిద్ధం చేసింది.

నగర వాసికి తప్పని నిరాశ... ప్రస్తావన లేని భారీ ప్రాజెక్టులు
నగర వాసికి తప్పని నిరాశ... ప్రస్తావన లేని భారీ ప్రాజెక్టులు

నిత్యావసర ధరలకు రెక్కలు?

కోటి దాటుతున్న నగర జనాభా. 40 లక్షలకు పైగా కుటుంబాలకు ఈ సారి బడ్జెట్‌ ఉసూరుమనిపించింది. కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు, సంస్థలకు నోచుకోలేదు. రవాణా ఛార్జీల పెంపుతో కూరగాయలు, పాలు తదితర నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశానికి తాకేలా చేయనున్నాయంటున్నారు ఈసీఐఎల్‌కు చెందిన గృహిణి లతాదేవి. ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, ఆసుపత్రి ఖర్చులు గతంలో ఎన్నడూ లేనంతగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఐటీ నిపుణుడు గణేష్‌ తెలిపారు.

మెట్రో రెండో దశకు ఏదీ దిశ?

దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో మెట్రో ప్రాజెక్ట్‌లకు కేంద్రం నిధులు ప్రకటించినా అందులో హైదరాబాద్‌ ఊసు లేదు. హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో రాయదుర్గం-శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో 31 కి.మీ., లక్డీకాపూల్‌- బీహెచ్‌ఈఎల్‌ వరకు 22 కి.మీ., నాగోల్‌-ఎల్‌బీనగర్‌ వరకు 5 కి.మీ. చేపట్టాలి. కేంద్రం సాయం చేస్తే తప్ప ప్రాజెక్ట్‌ మొదలు కాదు. ఇవికాక ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌, బీహెచ్‌ఈఎల్‌-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్‌-ఫలక్‌నుమా, శంషాబాద్‌ విమానాశ్రయం, తార్నాక-ఈసీఐఎల్‌, జేబీఎస్‌-అల్వాల్‌.. ఇలా మరో 100 కిలోమీటర్ల వరకు మెట్రో రైళ్ల కోసం స్థానికంగా డిమాండ్లు ఉన్నాయి.

మరిన్ని వెల్‌నెస్‌ కేంద్రాలు!

నగర వాసుల ఆరోగ్యానికి కొండంత భరోసా లభించనుంది. దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కొత్తగా అర్బన్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలనేది తాజా ప్రతిపాదన.

స్వచ్ఛంగా.. మెచ్చంగా...

నగరాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు మౌలిక సౌకర్యాలు, పర్యావరణహిత విధానాలకు కేంద్ర ప్రభుత్వం అర్బన్‌ స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద భారీగా నిధులు కేటాయించింది. ఆ నిధుల్లో మన నగరానికీ వాటా దక్కుతుందని జీహెచ్‌ఎంసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పారిశుద్ధ్య వాహనాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తుందని అంటున్నారు.

వీధి వ్యాపారులకు భరోసా

ఆర్థికంగా ఒడిదొడుకులను ఎదుర్కొంటూ బతకుపోరాటం చేస్తున్న వీధి వ్యాపారులకు తోడ్పాటునందించేందుకు వివిధ పథకాలను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం వారి సామాజిక భద్రతకు మరో అడుగు ముందుకేసింది. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వీధి విక్రేతలకు సామాజిక భద్రత పథకాల్లో చోటు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నగరంలోని సుమారు 1లక్ష 45వేల మంది వీధి విక్రేతలు లబ్ధి పొందనున్నారు. ఆరోగ్యం క్షీణించినా వైద్యం చేయించుకోలేని పరిస్థితుల నుంచి సామాజిక భద్రత కొరవడటం వంటి సమస్యలు కొన్నేళ్లుగా వారు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం వారికి ఊరట కలిగించింది. అర్హులందరినీ గుర్తించి పథకాల ఫలాలు అందించాలని తెలంగాణ స్ట్రీట్‌ వెండార్స్‌ అండ్‌ హాకర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.వెంకట్‌ మోహన్‌ కోరారు.

నగరంలో భూముల లభ్యత పెరగనుంది

అందుబాటు ధరల్లో రూ.45 లక్షల లోపు ఇళ్ల నిర్మాణం చేపట్టేవారికి వచ్చే లాభాల్లో పన్ను మినహాయింపును 2022 మార్చి వరకు పొడిగించారు. నగరంలో వీటి నిర్మాణాలు చేపట్టేందుకు మరింతమంది బిల్డర్లు ముందుకొచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ భూములను మానిటైజ్డ్‌ చేయనున్నట్లు చెప్పారు. దీంతో పాత ఎంసీహెచ్‌ పరిధిలో భూముల లభ్యత పెరగనుంది. ఇలాంటివి 20 శాతం భూములు ఉన్నాయి. వీటిని అమ్ముకోవచ్చని బడ్జెట్‌లో చెప్పారు. అద్దె గృహాల నిర్మాణంపై ఇదివరకు ప్రకటించిన పాలసీ పట్ల ఎవరూ ఆసక్తి చూపలేదు. వీటి అద్దెలపై పన్ను మినహాయింపుతో ముందుకొచ్చే అవకాశం ఉంది.

-సి.శేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఛాప్టర్‌, ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌

నిరసన గళం

బడ్జెట్‌ పట్ల రైల్వే ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ అదనపు ప్రధాన కార్యదర్శి భరణి భానుప్రసాద్‌, హైదరాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు కేవీఆర్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాచిగూడ స్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.1293 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.