ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో దుకాణాలు ఈరోజు తెరుచుకున్నాయి. నిన్న మెయిన్ రోడ్డులోని షాపులు తెరిచేందుకు పోలీసులు అనుమతించలేదు. ఛాంబర్ ప్రతినిధులు, అధికారులతో చర్చించిన అనంతరం అనుమతి ఇవ్వటం వల్ల ఈరోజు షాపులు తెరుచుకున్నాయి.
నగరంలోని దేవీచౌక్, దానవాయిపేట, మెయిన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపుల మేరకు దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఇన్ని రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు దుకాణాలు వద్దకు పరుగులు తీశారు. ఉదయం పూట రహదారులు రద్దీగా మరాయి.