కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై నటుడు శివబాలాజీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లిటేరా జీ పాఠశాల ఎలాంటి సమాచారం లేకుండా తన పిల్లలను ఆన్లైన్ తరగతుల నుంచి తొలగించడంపై ఆయన కమిషన్కు ఫిర్యాదు చేశారు.
ఆన్లైన్ తరగతుల పేరిట స్కూల్ యాజమాన్యం విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని కమిషన్కు వివరించారు. పెంచిన పాఠశాల ఫీజులను తగ్గించాలని కోరితే.. తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లలను ఆన్లైన్ తరగతుల నుంచి తొలగించారని శివ బాలాజీ ఆరోపించారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు.
ఇదీ చూడండి:తొలిరోజు సెషన్లో ప్రశ్నోత్తరాల అంశంపై వాడివేడి చర్చ